/rtv/media/media_files/2025/01/10/NnW4eBvIoGxwsmj9AXL1.jpg)
allu arjun tweet on allu arvind birthday
Allu Arjun: ఇటీవల కాలంలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోయింది. పుష్ప2 రిలీజ్, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడంతో అతడిపై విమర్శలు మొదలయ్యాయి. బన్నీపై కేసు నమోదు కావడం, జైలుకెళ్లడం, జైలులో ఒక నైట్ ఉండటం, అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం ఇలా ప్రతీది ఒక పీడకళగా జరిగిపోయింది. దాదాపు ఒక నెల రోజుల పాటు ఇదే వ్యవహారంతో అల్లు అర్జున్ అండ్ అతడి ఫ్యామిలీ బాగా సఫర్ అయింది.
Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు
ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఒక రకంగా అల్లు ఫ్యామిలీ తీవ్ర బాధను అనుభవించింది అనే చెప్పాలి. ఇక ఇటీవలే అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. దీంతో అల్లు ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్‌తో పాటు అతడి భార్య స్నేహరెడ్డి, తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఆ ఇన్సిడెంట్ నుంచి కోలుకుంటున్నారు.
Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా
హ్యాపీ మూడ్
ఇక ఇవాళ అల్లు అరవింద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర హ్యాపీ మూడ్‌లో కనిపించారు. బన్నీ, స్నేహారెడ్డి, పిల్లలు, అల్లు అరవింద్, అతడి భార్యతో సహా మరికొందరు ఒకే ఫ్రేమ్‌లో ఉన్నారు. అల్లు అరవింద్ తన బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు. దీంతో బన్నీ ఇన్సిడెంట్ తర్వాత.. అల్లు ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఉన్న మొదటి క్షణాలు ఇవే అని చెప్పొచ్చు.
Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF
— Allu Arjun (@alluarjun) January 10, 2025
Also Read: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్
అదే సమయంలో బన్నీ తన తండ్రి కోసం భారీ కేక్ ఏర్పాటు చేశాడు. ‘పుష్ప కా బాప్’ అంటూ ఉన్న ఆ కేక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ కేక్ చూసి బన్నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఇవాళ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ విడుదలైంది. ఫస్ట్ షో నుంచే సినిమా బాగుందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అస్సలు బాలేదని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ సైతం సినిమా బాగుందని అంటుండటం గమనార్హం.