జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. దీనికి సంబంధిచిన ట్రైలర్‌ను నిఖిల్ విడుదల చేశారు ప్రధాని మోదీ తిరిగి దాన్ని రీ పోస్ట్ చేశారు. తనకు హిందీ రాదు...తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి అని నిఖిల్ కామత్ అంటే...ఒక పాడ్‌కాస్ట్‌కు మాలాడ్డం తనకు ఇదే మొదటి సారని...ఎలాంటి స్పందన వస్తుందో తెలియదని మోదీ సమాధానం చెప్పడంతో ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. దాని తరువాత యువత రాజకీయాలోకి రావడం, ప్రపం యుద్ధ పరిస్థితులు, మొదటి, రెండవ టర్మ్ పాలన మధ్య తేడాలు లాంటి అంశాల మీద ఇద్దూ చర్చించుకున్నారు. Also Read: GC: మూడేళ్ల ఎదురుచూపులకు తెర పడింది...మిక్స్‌డ్ టాక్‌లో గేమ్ ఛేంజర్ గతంలో ఏదో అని ఉంటాను... రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూలేంటి అని నిఖిల్ కామత్...ప్రధనిని అడిగితే...దానికి ఆయన సమాధానం చెబుతూ రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజాసేవ చేయాలన్న మిషన్ తీసుకోవడం కోసం రావాలి.. సొంత లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం కాదు అంటూ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే తాన పాత ప్రసంగాలను తల్చుకుంటూ మోదీ గతలో తాను ఏదో అని ఉంటానని...పొరపాట్లు జరుగుతుంటాయి...నేనూ మనిషినే...దేవుడిని కాదని అనడం ఆసక్తి కలిగించింది. ఇందులో ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడని విధంగా మాట్లాడటంతో ఈ ట్రైలర్ కాస్తా వైరల్ అవుతోంది. దాంతో పాటూ ప్రధాని దాన్ని రీ పోస్ట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూను మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా అని పెట్టడం ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. త్వరలోనే దీని పూర్తి వీడియోను రిలీజ్ చేయనున్నారు. I hope you all enjoy this as much as we enjoyed creating it for you! https://t.co/xth1Vixohn — Narendra Modi (@narendramodi) January 9, 2025 An enjoyable conversation with @nikhilkamathcio, covering various subjects. Do watch... https://t.co/5Q2RltbnRW — Narendra Modi (@narendramodi) January 10, 2025 Also Read: USA: హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ