Producer Natti Kumar On Dil Raju Comments | దిల్ రాజు మాస్టర్ ప్లాన్ | Ticket Price Hike | RTV
ఆంధ్రప్రదేశ్లో సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. సినీ రంగంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వపన్ కళ్యాణ్ లేఖను నిర్మాత అల్లూ అరవింద్ సమర్థిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు.
మెగా అభిమానులకు నిర్మాత అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పాడు. 'తండేల్' మూవీ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయి తగ్గించి తాను మాట్లాడినట్లు వార్తలు రావడం బాధాకరమన్నాడు. 'చెర్రీ నాకు ఏకైక మేనల్లుడు. నేను ఏకైక మేనమామను. ఫ్యాన్స్ ఫీలైతే సారీ. ట్రోల్స్ ఆపండి' అని కోరాడు.
అల్లు అరవింద్ ఇటీవలే పాల్గొన్న ఓ ఈవెంట్ లో బన్నీ డాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమేంటో తెలిపారు. బన్నీకి వచ్చిన డాన్స్ తనది కాదని.. తన భార్య నుంచి వచ్చిందని చెప్పారు.
‘తండేల్’ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వానికి అడగకపోవడానికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. తెలంగాణలో మూవీ టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయని అన్నారు. అందుకే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదని తెలిపారు.
'తండేల్' సినిమాకు దేవి మ్యూజిక్ చేయడానికి ముందుగా ఒప్పుకోలేదని అల్లు అరవింద్ తెలిపారు. అదే సమయంలో పుష్ప2 కి వర్క్ చేస్తుండడంతో టైం స్పేర్ చేయగలరా లేదా అని సందేహంలో ఉన్నారట. కానీ బన్నీ లవ్ స్టోరీకి దేవినే కరెక్ట్ అని చెప్పడంతో దేవినే ఫిక్స్ అయిపోయినట్లు తెలిపారు.
నాగ చైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్ను వైజాగ్లో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదని, ఇక్కడ కలెక్షన్లు రావాలని, లేకపోతే ఇంట్లో తన పరువు పోతుందని తెలిపాడు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. దీనికి హీరోయిన్ సాయి పల్లవి హాజరు కాలేదు. ఆమెకు ఒంట్లో బాగోలేక పోవడం వల్లనే హాజరు కాలేకపోయిందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.
తండేల్ 'హైలెస్సో.. హైలస్సా' రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ డాన్స్ వైరల్ గా మారింది. స్టేజ్ పై సింగర్స్ తో కలిసి 'హైలెస్సో' పాటకు స్టెప్పులేశారు. తండేల్ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.