Allu Arjun: నాంపల్లి కోర్టుకు మళ్లీ అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ మరోసారి కోర్టుకు హాజరు కానున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు.

New Update
allu arjun fan

allu arjun

Allu Arjun: టాలీవుడ్‌ స్టార్ నటుడు అల్లు అర్జున్‌ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ పై కేసు నమోదు చేశారు. బన్నీ ప్రస్తుతం హైకోర్టులో మధ్యంతర బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పై వాదనలు ముగిశాయి.

Also Read: USA: అమెరికా హౌస్ స్పీకర్‌గా  మళ్ళీ మైక్‌ జాన్సన్‌ ఎన్నిక

 కోర్టు తీర్పు వెలువరించింది.నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చార్జిషీట్ దాఖలు చేసే వరకు రెండు నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలిచ్చింది.

Also Read: Syria:సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం

మరోసారి నాంపల్లి కోర్టుకు...

ప్రతి వ్యక్తికి ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు చెప్పింది. దీంతో పాటు, అతనిని విచారిస్తున్న పోలీసులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరించవద్దని కోర్టు అల్లు అర్జున్ కు చెప్పింది. ఈ కేసులో సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించవద్దని కోర్టు హెచ్చరించింది.ఈ క్రమంలో ఈ రోజు అల్లు అర్జున్ మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు ఆయన సమర్పించనున్నారు. 

లంచ్ సమయం లోపలే కోర్టు కు వెళ్లి పత్రాలు సమర్పిస్తారు. స్వయంగా మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేయనున్నారు. గత నెల 4వ తేదీన పుష్ప బెనిఫిట్ షో రోజున సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా బన్నీ సంధ్య థియేటర్‌కు వెళ్లారు. 

ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను చూడటానికి అభిమానులు పరుగులు తీశారు. ఈ కారణంగా అక్కడ అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో దిల్ సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు.రేవతి మరణించగా, ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు.

Also Read: USA: ప్రమాణ స్వీకారానికి ముందు హష్ మనీ కేసు విచారణకు ట్రంప్

Also Read: BIG BREAKING: హోంమంత్రి పీఏపై అవినీతి ఆరోపణలు.. సర్కార్ సంచలన నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు