/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-5-1-jpg.webp)
Ap: హోంమంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేట్ పీఏగా పని చేస్తున్న సంధు జగదీష్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఆ పోస్టు నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని,సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ముందు నుంచి జగదీష్ పై ఆరోపణలున్నాయి.
Also Read: Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు!
ఆయన వ్యవహార శైలి , ప్రవర్తన దురుసుగా ఉందని టీడీపీ వారు, అనితను వివిధ పనుల పై కలవటానికి వచ్చిన వారు ముందు నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్ గత పదేళ్లుగా అనిత దగ్గర ప్రైవేటు పీఏగా పని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై..ఆమె హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకుడు అయినప్పటికీ లెక్క చేసేవాడు కాదు.
మంత్రి తర్వాత అంతా తానే అన్నట్లు ఉండేవాడు. ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ని పీఏగా తీసేయలేదు.దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీని పై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత..జగదీష్ ను పీఏగా తొలగించారు.
Also Read: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏం చేసుకుంటారో..చేసుకోండి..
ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగానే వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్ , జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు.జగదీష్ లెక్కలేని తనం , అరాచకాల్ని సహించలేని ఎస్‌రాయవరం మండలానికి చెందిన టీడీపీ నాయకులు కొందరు ఆయన అక్రమాల గురించి ఓ అంతర్గత సమావేశాన్ని పెట్టుకుని ఆయన విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలనుకున్నారు. దీని గురించి తెలిసిన జగదీష్..ఆ నాయకుటకు ఫోన్ చేసి ఏం చేసుకుంటారో..చేసుకోండి అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు.
దీంతో హోంమంత్రికి భయపడి..వారెవరూ కూడా అప్పట్లో నోరు విప్పలేదు.మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్ అధికారుల ద్వారా లైసెన్సుదారుల పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని జగదీష్ పై ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి ఊహించని సమస్యలు
Also Read: Tamilanadu: ఉద్యోగులకు సంక్రాంతి బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం