USA: అమెరికా హౌస్ స్పీకర్‌గా  మళ్ళీ మైక్‌ జాన్సన్‌ ఎన్నిక

అమెరికా హౌస్ స్పీకర్ గా మళ్ళీ మైక్ జాన్సనే ఎన్నికయ్యారు. నిన్న జరిగిన అమెరికా ప్రతినిధుల సభలో  రిపబ్లికన్ పార్టీ తరుపు నుంచి మైక్ 218 ఓట్లతో  గెలిచారు. మైక్ వరుసగా రెండవసారి స్పీకర్‌‌గా పని చేయనున్నారు. 

New Update
us

Mike Janson, speaker

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి నిన్న ఎన్నికలు నిర్వహించారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ తరుఫు నుంచి మైక్ జాన్సన్ పోటీలో నిల్చున్నారు. ఈయనకు 218 ఓట్లు అనుకూలంగా పోలయితే..215 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దాదాపు రెండు గంటల పాటూ ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. మైక్‌కు ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు సైతం ఓటేశారు. ప్రక్రియ అనంతరం మైక్ జాన్సన్ ను స్పీకర్‌‌గా అనౌన్స్ చేశారు. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మైక్‌కే ఓటు వేశారు.  తరువాత స్పీకర్‌‌గా ప్రమాణం చేసిన ఆయన ఇది నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం అని అన్నారు. అమెరికా చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయ సమయం అని చెప్పారు. 

అంతకు ముందు  2023లో మొదటిసారిగా లూసియానా ప్రతినిధి మైక్ జాన్సన్ ను స్పీకర్‌‌గా ఎన్నుకొన్నారు. అప్పట్లో మూడు వారాల ప్రతిష్టంభన తర్వాత మైక్‌ను  స్పీకర్‌‌గా ఎన్నికయ్యారు. అప్పుడు కూడా ఆయకు 220 ఓట్లు అనుకూలంగా, 209 ఓట్లు వ్యతిరేకంగా పోలయ్యాయి. మాజీ ప్రెసిడెంట్ కెవిన్ మెక్‌కార్తీ, R-కాలిఫ్‌పై అభిశంసన తర్వాత మూడు వారాల క్లోజ్డ్ డోర్ చర్చల తర్వాత అక్టోబర్ 2023లో జాన్సన్ గెలుపొందారు.

ట్రంప్ శుభాకాంక్షలు..

ఇక మైక్ మళ్ళీ స్పీకర్‌‌గా ఎంపిక అయినందుకు నూతన అధ్యక్షుడు ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. అతను అద్భుతమై సార్ధ్యం ఉన్నవాడని ట్రంప్ అన్నారు. ఈరోజు మైక్ సాధించిన విజయం రిపబ్లికన్ పార్టీకి గొప్ప విజయమే కాదు మా 129 సంవత్సరాల మెజారిటీకి మరో గుర్తింపు కూడా అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు