జనవరి పదిన అమెరికా చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగనిది జరగబోతోంది. ఇప్పటివరకు ఏ సిట్టింగ్ లేదా మాజీ అధ్యక్షుడూ ఏ నేరానికి శిక్ష పొందలేదు. ఇప్పుడు మొట్ట మొదటిసారిగా అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిస్థితి ఎదుర్కొనబోతున్నారు. హష్ మనీ కేసులో ట్రంప్‌కు జనవరి 10న శిక్ష విధిస్తామని న్యూయార్క్, మాన్‌హట్టన్ జడ్జి జవాన్ మర్చన్ స్పష్టం చేశారు. అయితే నూతన అధ్యక్షుడికి జైలు శిక్ష విధించే అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది. శిక్ష విధించినా తన అధికారాన్ని, అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తించే విధంగానే ఉండబోతోందని చెబుతున్నారు. అనధికార వ్యవహారాల్లో రక్షణ ఉండదు.. పోర్న్ స్టార్ కు హష్ మనీ ఇచ్చిన వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై నమోదైన అభియోగాలను కొట్టేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని న్యాయమూర్తి జువాన్ మర్చన్ స్పష్టంచేశారు. హష్ మనీ లాంటి వ్యవహారాల్లో ట్రంప్‌నకు రక్షణ ఇవ్వలేమని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలింది. గత డాది నవంబర్‌లో కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో ఆయన అధ్యక్షుడగా ఎన్నికవడంతో దానిని వాయిదా వేసింది. Also Read: Manipur: మణిపూర్‌లో మళ్ళీ మొదలైన గొడవలు..ఎస్పీ ఆఫీస్ పై దాడి జనవరి 10న ట్రంప్ వ్యక్తిగతంగాలేదా శిక్ష విధించే సమయంలో హాజరుకావచ్చునని జడ్జి చెప్పారు. అయితే ఆయకు జైలు శిక్ష విధించడం తనకు ఇష్టం లేదని...షరతులతో కూడిన విడుదల లేదా జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. అదే అత్యంత ఆచరణీయమైన పరష్కారమని రాశారు. ఏది ఏమైనా అధ్యక్షుడు ట్రంప్‌కు రిలీఫ్ లభించడం చాలా అవసరని ట్రంప్ తురుఫు న్యాయవాదులు అంటున్నారు. అతనిపై కేసులు ఉంటే పరిపాలన సాధ్యం కాదని చెబుతన్నారు. ఈ క్రమంలో జనవరి 10న డొనాల్డ్ ట్రంప్‌కు ఏ రకమైన శిక్ష విధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. Also Read: SM: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!