Supritha: కూతురి డబ్బింగ్ లో అమ్మ సపోర్ట్.. హీరోయిన్ గా  నటి సురేఖవాణి అమ్మాయి!

టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా మల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న  'చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి' సినిమాతో రంగప్రవేశం చేయనుంది.

New Update
SUPRITHA

SUPRITHA

Supritha: టాలీవుడ్ నటి సురేఖ వాణి(surekha-vani) కూతురు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్(amar-deep-movie-with-supritha) హీరోగా మల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న  'చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి' సినిమాతో రంగప్రవేశం చేయనుంది. సోషల్ మీడియాలో రీల్స్, యూట్యూబ్ వీడియోలతో ఆకట్టుకున్న సుప్రీత.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై  ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 

కూతురికి అమ్మ సపోర్ట్

ప్రస్తుతం సుప్రీత తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఈ క్రమంలో మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. సుప్రిత డబ్బింగ్ చెప్తున్న సమయంలో ఆమె తల్లి  సురేఖావాణి  స్టూడియోకి వెళ్లి కూతురికి సపోర్ట్ గా ఉన్నారట. డబ్బింగ్ చెప్పడంలో కూతురికి అవసరమైన గైడెన్స్ అందించారట. కొత్త నటి అయినప్పటికీ, సుప్రిత నటనలో మెళకువలు  వేగంగా నేర్చుకుని సహజంగా డైలాగ్స్ చెప్పిన తీరు చిత్ర యూనిట్ మొత్తాన్ని ఆకట్టుకుందట. 

Also Read :  కథ చెబుతానని పిలిచి ఆ డైరెక్టర్ బలవంతం చేసాడు: మౌనీ రాయ్

M3 మీడియా బ్యానర్ లో మహేంద్రనాథ్ కొండ్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భిన్నమైన కాన్సెప్ట్ తో సామజిక కథగా దీనిని రూపొందించారట. ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేయగా అమర్, సుప్రీత జోడీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సీనియర్ నటులు రాశీ, సురేఖ వాణి, వినోద్ కుమార్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  

Also Read: Deepika Padukone: ప్రభాస్ ప్రాజెక్ట్స్ నుండి అందుకే తప్పుకున్నా: దీపికా పదుకొణె

Advertisment
తాజా కథనాలు