/rtv/media/media_files/2025/07/24/harihara-veeramallu-pawan-fans-2025-07-24-11-38-34.jpg)
harihara veeramallu pawan fans
Hari Hara Veera Mallu: నాలుగేళ్ళ నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. మచిలీపట్నంలోని రేవతి థియేటర్లో భీభత్సం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. థియేటర్ ఎంట్రన్స్ గేట్ వద్ద గ్లాసులు ధ్వంసం చేసి గందరగోళం చేశారు. పరిమితికి మించి అభిమానులు అభిమానులు ప్రీమియర్ షోకి రావడంతో పోలీసులు కట్టడిచేయలేకపోయారు. ఒకరినొకరు తోసుకుంటూ థియేటర్లోకి చొచ్చుకొని వచ్చారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు కడపలోని రాజా థియేటర్ ప్రాంగణంలో కర్రలతో కొట్టుకున్నారు ఫ్యాన్స్. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థిని అదుపు చేశారు.
మచిలీపట్నంలోని రేవతి థియేటర్లో తనుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ఒకరి పై ఒకరు పిడిగుద్దులతో దాడి
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2025
థియేటర్ ఎంట్రన్స్ గేట్ గ్లాసులు ధ్వంసం
పరిమితికి మించి ప్రీమియర్ షోకి వచ్చిన అభిమానులు
కట్టడి చేయలేకపోయిన పోలీసులు, ధియేటర్ యాజమాన్యం
తోసుకుంటూ థియేటర్లోకి చొచ్చుకొచ్చిన పవన్… https://t.co/l9qomKlv2Upic.twitter.com/y6ZN24VHdT
పాజిటివ్ టాక్
ఇదిలా ఉంటే ' హరిహర వీరమల్లు' సినిమాకు మంచి స్పందన వస్తోంది. వీరమల్లుగా పవన్ స్క్రీన్ ప్రజెన్స్, హీరోయిజం, యాక్షన్ సినిమాకి ప్రాణం పోశాయని నెటిజన్లు చెబుతున్నారు. అలాగే పవన్ ఇంట్రడక్షన్ సీన్, యాక్షన్ సన్నివేశాలకు కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్ గా నిలిచాయని అంటున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుందని.... సెకండ్ ఆఫ్ నిరాశపరిచిందని అభిమానుల అభిప్రాయం.
16వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పటి ఔరంగాజేబ్ పాలనలో హిందువులపై జరిగిన అణచివేతను, దురాగతాలకు వ్యతిరేకంగా వీరమల్లు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టిన ఈ కథను.. డైరెక్టర్ జ్యోతికృష్ణ పూర్తి చేశారు. పలు కారణాల చేత క్రిష్ మధ్యలోనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
Also Read: Block Buster HHVM: సంధ్యా థియేటర్ దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామా..అప్రమత్తంగా పోలీసులు