Mirai Song: తేజ సజ్జా లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో విడుదల చేశారు. 'వైబ్ ఉంది బేబీ' అంటూ యూత్‌ఫుల్ గా సాగిన ఈ పాట ఫ్యాన్స్ కి మస్తు వైబిస్తుంది. ఈ పాటలో తేజ సజ్జ తన ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు. అలాగే హీరోయిన్ రితికా నాయక్, తేజ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ హుషారైన పాటను అర్మాన్ మాలిక్ పాడగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు.
Also Read:Meenaakshi Chaudhary: పడుకొని ఫొటోలకు ఫోజులిస్తున్న మీనాక్షి.. అబ్బా భలే ఉంది!
Packed all my energy, dance, and a full vibe into this one,
— Teja Sajja (@tejasajja123) July 26, 2025
Just to make you all smile 😊#VibeUndi – Let the music speak!
Song OUT NOW 🎧💃🕺
— https://t.co/JHuN3mz6fb#MIRAI in cinemas SEP 5th, 2025.@RitikaNayak_@GowrahariK@Karthik_gatta@peoplemediafcy@tipsofficial… pic.twitter.com/H1pCraGjyc
యోధుడిగా తేజ సజ్జా
యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న 'మిరాయ్' తేజ సజ్జా ఒక యోధుడిగా కనిపించబోతున్నాడు. భారతీయ పురాణ కథలను, చరిత్రను ఆధునిక యాక్షన్‌తో కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో ఈ చిత్రం విడుదల కానుంది. దాదాపు ఎనిమిదికి పైగా భాషల్లో 2d, 3d ఫార్మట్స్ లో అందుబాటులోకి రానుంది. 'హనుమాన్' తర్వాత తేజ సజ్జా నుంచి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇందులో మంచు మనోజ్ విలన్ గా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తమవుతున్న ఈ చిత్రంలో వీఎక్స్ రికార్డు స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో అద్భుతమైన విజువల్స్ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని హిట్ ఇచ్చాయి.
Also Read:Anchor Anasuya: పచ్చని ప్రకృతిలో నలుగుతో కుమారులకు స్నానం.. అనసూయ వీడియో వైరల్!