ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. ఏసీబీ కోర్టులో తేలలేదు...హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. ఇప్పటికే చాలా దర్యాప్తు జరిగింది...ఇప్పడు దీనిపై తాము ఎలా విచారిస్తాము...అందుకే కేసును కొట్టేస్తున్నామని హైకోర్టు చెప్పింది. దీనిని సవాలు చేస్తు చంద్రబాబు తరుఫు లాయర్లు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
చంద్రబాబు కేసుల విషయంలో నిన్న చాలా కీలక పరిణామాలు జరిగాయి. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు ఏసీబీ కోర్టు కూడా బాబు రిమాండ్ ను మరో రెండు రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మామూలుగా అయితే బాబు రిమాండ్ నిన్నటితో అయిపోవాలి. కానీ దానిని రెండు రోజులు పొడిగించిన ేసీబీ కోర్టు...రెండు రోజుల సీఐడీ కస్టడీకి కూడా అనుమతించింది. దాని ప్రకారం ఈరోజు ఉదయం రాజమండ్రి జైలుకు చేరుకున్న సీఐడీ అధికారులు ఉదయం 9 నుంచి బాబును ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఇది కొనసాగనుంది. ప్రతీ గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తూ దీనిని కొనసాగిస్తున్నారు. ఈరోజుతో పాటూ రేపు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తొలి రోజు ఫస్ట్ హాఫ్ విచారణ మధ్యహ్నం 1 గంటలకు ముగిసింది. ఒంటి గంటల నుంచి 2 గంటల వరకు.. అంటే గంట పాటు చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు సీఐడీ అధికారులు. ఈ సమయంలో ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని చేయనున్నారు చంద్రబాబు. అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ విచరాణ కొనసాగనుంది. అయితే.. అనేక ప్రశ్నలకు చంద్రబాబు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.