CID filed memo: చంద్రబాబు రిమాండ్ పొడిగించండి.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు రెండోసారి విధించిన రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్లో ఆయనను హాజరుపరిచారు. మరోవైపు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని ఏసీపీ కోర్టులో ఎక్స్టెన్షన్ మెమో దాఖలు చేసింది సీఐడీ. చంద్రబాబును మరో 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలని మెమోలో సీఐడీ పేర్కొంది.