Valentines Day Mobile Offers: వాలెంటైన్స్ డే ఆఫర్స్.. మీ ప్రేయసికి రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే!

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. సామ్‌సంగ్, వివో, మోటో వంటి ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు. అందువల్ల మీ ప్రేయసి/ప్రియుడికి రూ.10 వేలలోపు కొత్త 5జీ ఫోన్ ఇవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాయిస్.

New Update
valentine day mobile offers under rs 10k

valentine day mobile offers under rs 10k

Valentines Day Mobile Offers: అతి తక్కువ ధరలో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్‌(5G SmartPhones)ను కొనాలని చూస్తున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. కేవలం రూ.10 వేలలోపే బ్రాండెడ్ 5జీ ఫోన్‌లను కొనుక్కోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flipkart) వాలెంటైన్స్ డే(Valentines Day) సందర్భంగా పలు ఫోన్లపై క్రేజీ డీల్స్ అందిస్తుంది. మీరు ఇలాంటి డీల్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇదే బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవాలి. ఇప్పుడు రూ.10వేలలో అందుబాటులో ఉన్న ఫోన్ల గురించి తెలుసుకుందాం. 

Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్

MOTOROLA g35 5G

ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA g35 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ ఉంది. దీని 4/128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,499 ఉండగా.. ఇప్పుడు 20 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో మోటోరోలా ఫోన్ కేవలం రూ.9,999లకే లభిస్తుంది. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. దాదాపు రూ.6,800 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. 

Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్

POCO M6 5G

ఫ్లిప్‌కార్ట్‌లో POCO M6 5G స్మార్ట్‌ఫోన్‌‌ను చాలా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. దీని 6/128జీబీ అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 17 శాతం తగ్గింపుతో రూ.11,499కి కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లతో మరింత తగ్గింపు పొందొచ్చు.

ఇక దీని 4/64జీబీ వేరియంట్ ను మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.11,999 కాగా ఇప్పుడు రూ.8,499కే కొనుక్కునే అవకాశం ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. 

Infinix Hot 50 5G

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ 4/128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999గా ఉంది. ఇప్పుడు దీనిపై 26 శాతం తగ్గింపు ఉంది. ఈ తగ్గింపుతో కేవలం రూ.9,499లకే సొంతం చేసుకోవచ్చు. వీటిపై బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సక్షన్లపై భారీ తగ్గింపు ఉంటుంది. అలాగే రూ.6,450 ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. 

Also Read: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!

అలాగే 8/128 జీబీ వేరియంట్‌ను రూ.10,999లకే కొనుక్కోవచ్చు. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై రూ.1500 తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.7,550 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. 

REDMI A4 5G 

REDMI A4 5G స్మార్ట్‌ఫోన్ 4/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.11,999గా ఉంది. దీనిని ఇప్పుడు 18 శాతం తగ్గింపుతో కేవలం 9,770 ధరకి సొంతం చేసుకోవచ్చు. 

అలాగే దీని 4/64జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999 కాగా ఇప్పుడు కేవలం రూ.9,373 ధరకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: నాకు పెళ్లి అవుతుంది..ఇప్పటికైనా నా ప్రొఫెల్‌ ని తీసేయండిరా బాబు...అదానీ చిన్న కుమారుడి స్పెషల్‌ రిక్వెస్ట్‌!

REDMI 13c 5G

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల లోపు అందుబాటులో ఉన్న మరో ఫోన్ REDMI 13c 5G. దీని 4/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 26 శాతం తగ్గింపుతో రూ.10,350లకే కొనుక్కోవచ్చు. అలాగే దీని 6/128జీబీ వేరియంట్ రూ.15,999 కాగా..29 శాతం డిస్కౌంట్‌తో రూ.11,299కే సొంతం చేసుకోవచ్చు. మరిన్ని బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు