/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Vote-1-jpg.webp)
ఢిల్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఉదయం ఏడు గంటకు పోలింగ్ కూడా ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు ఇది కొనసాగనుంది. దాని తరువాత 6.30 ని.ల వరకూ ఎగ్జిట్ పోల్స్ ఎవ్వరూ ఇవ్వడానికి వీలు లేదని ఈసీ చెప్పింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఢిల్లీ(Delhi)లో 70 అసెంబ్లీ స్థానాలుండగా.. అందులో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 83.49 లక్షలు కాగా.. మహిళా ఓటర్లు 71.74 లక్షల మంది ఉన్నారు. ఇందులో 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 25.89 లక్షలు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో 2.08 లక్షల మంది మొదటిసారిగా ఓటు వేయనున్నారు. అలాగే ఓటు హక్కు వినియోగించుకునే ట్రాన్స్‌జెండర్లు(Transgenders) 1261 మంది ఉన్నారు.
పోటాపోటీగా ప్రచారం..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ(AAP), బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు పోటీపడి ప్రచారాలు నిర్వహించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత హమీల వరాల జల్లులు కురిపించాయి. అయితే ఆమ్ ఆద్మీకి 55 సీట్లు వస్తాయని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ప్రజలు గట్టిగా అనుకుంటే 60కి పైగా సీట్లు వస్తాయని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన చివరి ఎన్నికల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ, జంగ్‌పురా, కల్కాజీలో ఆప్ గెలవదని బీజేపీ చెబుతోందని.. కానీ ఆ స్థానాల్లో ఆప్ చారిత్రాత్మక మెజార్టీతో గెలవనుందని అన్నారు.
కేజ్రీవాల్ మీద కేసు నమోదు...
ఒకవైపు ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే..ఆప్ అధినేత కేజ్రీవాల్ కు హర్యానా ప్రభుత్వం షాకిచ్చింది. యమునా జలాలను హర్యానాలో బీజేపీ విషపూరితం చేస్తోందని కేజ్రావాల్ ఆరోపించారు. దీనిపై ఇప్పుడు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని ప్రోత్సహించడం, తప్పుడు నేరం మోపడం వంటి అభియోగాలతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేజ్రావాల్ యమునా నది నీటి విషయంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్నే రేపాయి. దీనిపై హర్యానా కోర్టు కూడా ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈనెల 17న న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Also Read: Sweden: స్వీడన్ లో కాల్పులు..పది మంది మృతి