/rtv/media/media_library/vi/96uxOzaEADw/hqdefault.jpg)
చాలా గ్యాప్ తర్వాత అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్'. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మత్స్యకారుల కథా నేపథ్యంలో రూపొందిన 'తండేల్' ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందించారు. ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్ కు ఎలా వెళ్ళారు. అక్కడి నుంచి అనుకోకుండా పాకిస్తాన్ వెళ్ళి ఎలా చిక్కుకున్నారు. వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా విడిపించింది అన్న కథాంశంతో తండేల్ మూవీని తీశాడు దర్శకుడు చందూ మొండేటి.
Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్
వారం రోజుల పాటూ టికెట్ల రేట్లు పెంపు..
మత్సకారుల దగ్గర నుంచి వారి కథలు తెలుసుకుని కార్తీక్ అనే యువకుడు కథ రాయగా...దానికి తనదైన స్క్రీన్ ప్లే ని జోడించి సినిమాగా తీశాడు చందూ మొడేటి. నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. దీనికి చై..15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో తండేల్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో టికెట్ మీద 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో టికెట్ పైన 75 రూపాయలు పెంచడానికి పర్మిషన్ ఇచ్చింది. సినిమా రిలీజ్ అయిన వారం రోజులు వరకు ఈ రేట్లను అమలు చేసుకోవచ్చని తెలిపింది.