/rtv/media/media_files/2025/08/07/tcs-2025-08-07-17-01-12.jpg)
TCS to roll out wage hikes for 80 percent workers
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని పేర్కొంది. జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మందికి ఈ వేతనాల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని ఇటీవల టీసీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వేతనాల పంపుపై ప్రకటన చేయడం గమనార్హం. కానీ ఏ స్థాయిలో వేతనాలు పెంచుతామనే దానిపై సంస్థ క్లారిటీ ఇవ్వలేదు.
అయితే సీ3ఏ, దానికి సమానమైన గ్రేడ్‌లలో అర్హులైన అసోసియేట్స్‌కు వేతన సవరణ ఉంటుందని టీసీఎస్ ఉద్యోగులకు ఇమెయిల్‌లో పంపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో తమ కంపెనీలో అంతర్జాతీయంగా మొత్తం 12,261 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇటీవల TCS సీఈవో కె.కృతివాసన్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు, ఏఐ టెక్నాలజీ మార్పుల వల్లే ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
Also Read : నిట్టనిలువునా కూలిపోయింది.. ఎరుపెక్కిన స్టాక్ మార్కెట్
TCS Roll Out Wage Hikes
ఇదిలాఉండగా ఒక్క టీసీఎస్ మాత్రమే కాదు చాలా టెక్ కంపెనీలు కూడా ఈ మధ్య భారీగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఏఐ వినియోగం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆర్థిక అస్థిరత, లాభాలు క్షీణించడం, కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం వంటి పరిస్థితుల వల్లే ఐటీ ఉద్యోగాలు పోవడం ఆందోళన కలిగిస్తోంది. 2019లో ఐటీలో మొదలైన ఈ కోతలు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చూసుకుంటే వందలాది కంపెనీలు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇచ్చాయి.
బడా కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా కూడా వేలాది సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అంతేకాదు చాలావరకు కంపెనీలు శాలరీ హైక్‌ను కూడా ఆపేశాయి. దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది జులై నాటికి 9 వేల ఉద్యోగాలు తొలగించింది. ఈ ఏడాదిలో మొత్తం 15 వేల ఉద్యోగాలు తొలగించనుంది. ఇంటెల్ సంస్థ 15 శాతం ఉద్యోగులను తొలగించనుంది. తమ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 96 వేలు ఉండగా వాటిని 75 వేలకు తగ్గించనుంది. దీంతో ఆ కంపెనీలో 24 వేల ఉద్యోగాలు పోనున్నాయి.
Also Read : 'భారత్ డెడ్ ఎకనామీ' వివాదం.. RBI చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇక IBM కంపెనీలో దాదాపు 8 వేల మందిని తొలగించినట్లు సమాచారం. 2022 నుంచి ఇప్పటిదాకా అమెజాన్ 27 వేల ఉద్యోగాలను తొలగించింది. ఈ ఏడాది జూన్‌లో 100 మంది ఉద్యోగులను లేఆఫ్స్ ఇచ్చింది. 2025 ప్రారంభంలో మెటా సంస్థ 3 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. గూగుల్ కూడా.. క్లౌడ్, పీపుల్ ఆపరేషన్స్, సేల్స్ తదితర విభాగాల్లో పనిచేసే వందలాది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చింది. దీంతో ఏ జాబ్ ఎప్పుడు పోతుందోనని తెలియక ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
rtv-news | telugu-news | it layoffs 2025 | latest-telugu-news | telugu business news | business news telugu | national news in Telugu