/rtv/media/media_files/2025/08/06/rbi-governor-2025-08-06-20-51-04.jpg)
India contributing more to global growth than the America, Says RBI Governor
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ డెడ్ ఎకానమీ అంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వృద్ధికి అమెరికా 11 శాతం దోహదం చేస్తే.. భారత్ దాదాపు 18 శాతం అందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం.. ప్రపంచ వృద్ధి 3 శాతం ఉంటే భారత్ వృద్ధి అంచనాలు 6.5 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోందని రాబోయే రోజుల్లో మరింత పురోగతి సాధిస్తామని తెలిపారు.
Also Read: 45 పైసలకే ప్రమాద బీమా, ఐదేళ్లలో రూ.27.22 కోట్లు చెల్లించాం.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
భారత జీడీపై అమెరికా సుంకాల ప్రభావంపై కూడా సంజయ్ మల్హోత్రా స్పందించారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం ప్రస్తుతం అంచనా వేయలేమన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని తెలిపారు. మనం ప్రతీకార సుంకాలు విధిస్తే గానీ.. మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం ఉండదని చెప్పారు. ఆర్థిక వృద్ధిపై అంచనాలు తగ్గించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో వృద్ధి అంచనాలు 6.7 శాతం నుంచి 6.5 శాతానికి సవరించినట్లు పేర్కొన్నారు. అలాగే GDP అంచనాలు సవరించేందుకు తమ వద్ద తగినంత డేటా లేదన్నారు .
Also Read: నెలకు రూ.60 వేల జీతంతో SBIలో క్లర్క్ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై కూడా ఆయన మాట్లాడారు. '' స్థూల ఆర్థిక పరిస్థితులను అంశాల వారీగా పరిశీలిస్తాం. వాటికి తగ్గట్లు సరైన నిర్ణయాలు ఉంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లలో 100 బేసిస్ పాయింట్లు ఇప్పటికే తగ్గించాం. ధరల స్థిరత్వాన్ని కొనసాగిస్తూ స్థిర వృద్ధి కోసం సరైన చర్యలు తీసుకుంటాం. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం చర్చల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇవి త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు.
Also Read: 'ట్రంప్ టారిఫ్‌లపై మోదీ అందుకే స్పందించడం లేదు'.. మరో బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ
ఇదిలాఉండగా ట్రంప్ భారత్‌పై తాజాగా మరో బాంబు పేల్చారు. మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు 25 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మొత్తం కలిపి 50 శాతం సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించినట్లు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. దీని ప్రకారం యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ భూభాగంలోకి దిగుమతి అయ్యే భారతదేశ వస్తువులపై 25 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: సీఎం పేర్లతో పథకాలు.. మద్రాస్ హైకోర్టు తీర్పును ఖండించిన సుప్రీంకోర్టు