/rtv/media/media_files/2025/07/31/stock-market-losses-2025-07-31-10-25-34.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై సుంకాలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించిన తర్వాత గురువారం భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 24,500 మార్కు కంటే దిగువకు పడిపోయింది. ప్రపంచంలో ముఖ్యంగా భారత్ తో పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలపై పెట్టుబడిదారులు ఆందోళనగా ఉన్నారు. దీని కారణంగానే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 24 క్షీణించగా, 6 పెరిగాయి.ఈరోజు బ్యాంకింగ్, ఆటో, ఐటీ స్టాక్‌లు భారీ క్షీణతను చూస్తున్నాయి. నిన్న కూడా స్టాక్ మార్కెట్ నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 166 పాయింట్లు పడిపోయి 80,544 దగ్గర.. నిఫ్టీ 75 పాయింట్లు పడిపోయి 24,574 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో 11 పెరిగాయి మరియు 19 పడిపోయాయి.
అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు..
అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.78% పెరిగి 41,110 వద్ద, కొరియా కోస్పి 0.45% పెరిగి 3,212 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.35% పెరిగి 25,022 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.12% పెరిగి 3,638 వద్ద ముగిశాయి. ఇక ఆగస్టు 6న అమెరికా డౌ జోన్స్ 0.18% పెరిగి 44,193 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 1.21% పెరిగి 21,169 వద్ద, ఎస్ అండ్ పి 500 0.75% పెరిగి 6,345 వద్ద ముగిశాయి.
మరోవైపు ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రష్యాతో చమురు వ్యాపారం మానుకోకపోతే టారీఫ్ లతో చంపేస్తా అన్న ట్రంప్ ఇప్పటికే భారత్ పై 50 శాతం సుంకాలను విధించారు. అయితే ఇక్కడితో అయిపోలేదు అని మళ్ళీ సంకేతాలిచ్చారు. భారత్ పై మరిన్ని ద్వితీయ ఆంక్షలు విధిస్తామని చెబుతున్నారు. ఇప్పటికి తాను టారీఫ్ లు అనౌన్స్ చేసి ఎనిమిది గంటలే అయింది..ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు. చైనావంటి దేశాలు కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నాయి అని కదా అని విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరు ఇంకా చాలా చూడబోతున్నారు. ద్వితీయ ఆంక్షలను కూడా చూడబోతున్నారు అని చెప్పారు.
Also Read: BIG BREAKING: రైతుల విషయంలో తలొగ్గేదే లేదు..టారీఫ్ లపై ప్రధాని మోదీ