Trump: గ్రీన్‌లాండ్‌ కొనుగోలు కోసం ట్రంప్ బిగ్‌ప్లాన్.. ప్రజలకు బంపర్ ఆఫర్

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసిన తర్వాత గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌  మరింత ఫోకస్ పెట్టారు. ఆ ద్వీప దేశాన్ని అమెరికాలో కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గ్రీన్‌లాండ్ ప్రజలను డబ్బుతో కొనాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.

New Update
USA Considers Up To $100,000 For Every Greenlander In Buyout Bid

USA Considers Up To $100,000 For Every Greenlander In Buyout Bid

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసిన తర్వాత గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌  మరింత ఫోకస్ పెట్టారు. ఆ ద్వీప దేశాన్ని అమెరికాలో కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గ్రీన్‌లాండ్ ప్రజలను డబ్బుతో కొనాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు ఆంగ్ల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం గ్రీన్‌లాండ్‌.. డెన్మార్క్‌ నుంచి విడిచిపోయి అమెరికాతో కలిసిపోయేందుకు ట్రంప్‌ యంత్రాంగం అధికారులు అక్కడి ప్రజలకు ప్రత్యక్ష నగదు ఇచ్చే అంశంపై చర్చలు జరిపారు. ఒక్కో వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లు (భారత కరెన్సీలో రూ.8 లక్షల నుంచి రూ.89 లక్షలు) మధ్య డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేశారు. 

Also Read: అమెరికాలో దారుణం.. మహిళను కాల్చి చంపిన ICE అధికారి


గ్రీన్‌లాండ్‌లో చూసుకుంటే కేవలం 57 వేల మంది ప్రజలు మత్రమే ఉన్నారు. వీళ్లకు నేరుగా చెల్లింపులు చేయాలనే చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనట్లు సమాచారం. అంతేకాదు అమెరికా నగదు చెల్లింపు ప్రణాళికలను గ్రీన్‌లాండ్‌ నాయకులు కూడా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేమని గ్రీన్‌లాండ్ ప్రధానమంత్రి జెన్స్‌ ఫ్రెడరిక్ నీల్సన్ తెలిపారు. మరోవైపు నాటో దేశాలు సైతం ట్రంప్‌ ప్లాన‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

Also Read: ఐఐటీ మద్రాస్‌లో పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌

మరోవైపు ట్రంప్‌ మాత్రం అంతర్జాతీయ చట్టాలతో తనకు పని లేదంటున్నారు. ప్రపంచ అధికారాలపై ఏమైనా పరిమితులు ఉన్నాయా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా సైనిక చర్యలకు ఆదేశించే అధికారంపై సొంత నైతికతే ఏకైక పరిమతి అని వ్యాఖ్యానించారు. తనకు ఇంటర్నేషనల్ చట్టాలతో పని లేదన్నారు. ప్రజలు బాధపడటాన్ని తాను చూడలేనన్నారు.    

Advertisment
తాజా కథనాలు