Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కానీ ఈ షేర్లు మాత్రం లాభాల్లో..

నేడు స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇలాంటి సమయంలో కూడా టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా, జొమాటో, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

New Update
stock market news

stock marketS

Stock Market: వరుసగా మూడవ రోజు భారత స్టాక్ మార్కెట్లు కూప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ(Sensex, Nifty) రెండు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బిఎస్ఇ‌లో సెన్సెక్స్ 481 పాయింట్లు తగ్గి 75813 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 141 పాయింట్లు తగ్గి 22925 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చూడండి:Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

ఇది కూడా చూడండి:Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

అప్పటి నుంచి స్టార్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. పెట్టుబడిదారులు ఏకంగా రూ.6.50 లక్షల కోట్లు గాల్లోకి కలిసిపోయాయి. మార్కెట్లో భారీ అమ్మకాల కారణంగా 30 సెన్సెక్స్ స్టాక్‌లలో కేవలం 24 స్టాక్‌లు క్షీణతతో ట్రేడవుతున్నాయి. మిగతా 6 స్టాక్‌లు మాత్రమే కాస్త పెరుగుతున్నాయి. 

పెరుగుతున్న షేర్లు

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నా కూడా కొన్ని షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా, జొమాటో, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

ఇది కూడా చూడండి:supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

Advertisment
Advertisment
తాజా కథనాలు