/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
అంతర్జాతీయ మార్కెట్లో రెండు రోజులుగా మిశ్రమ సంకేతాలు నడుస్తున్నాయి. ఈ ప్రభావం ఇండియన్ మార్కెట్ల మీద కూడా పడింది. దీని కారణంగా వరుస లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్(Stock Market) ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్ 550 పాయింట్లు తగ్గి 81,450 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 170 పాయింట్లు తగ్గి 24,900 వద్ద ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.36 దగ్గర ఉంది.
Also Read : ఊపుమీదున్న బజాజ్, రిలయెన్స్ షేర్లు..వరుసగా నాలుగో రోజులు లాభాల్లో మార్కెట్
మొదలైన అదనపు సుంకాల ఎఫెక్ట్..
సెన్సెక్స్(Sensex) లోని 30 స్టాక్‌లలో 24 నష్టపోగా.. 6 లాభపడ్డాయి. BEL, M&M, టాటా మోటార్స్ స్వల్పంగా పెరిగాయి. ICICI బ్యాంక్, HCL టెక్ మరియు అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 32 నష్టపోగా.. 18 లాభాల్లో ఉన్నాయి. NSE తాలూకా IT, మెటల్ , ప్రైవేట్ బ్యాంకింగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. రియాలిటీ, మీడియా, ఫార్మా స్వల్పంగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాలు ఈ నెల 27 నుంచి అమలు కానున్నాయి. అయితే వాటి గడువును పెంచకపోవచ్చని ఈరోజు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నరోవ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో మదుపర్లు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతున్నారు.
మిశ్రమంగా ప్రపంచ మార్కెట్..
ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 0.012% పెరిగి 42,615 వద్ద, కొరియా కోస్పి 0.78% పెరిగి 3,166 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.39% పెరిగి 25,201 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.67% పెరిగి 3,796 వద్ద ముగిసింది. ఆగస్టు 21న అమెరికా డౌ జోన్స్ 0.34% తగ్గి 44,786 వద్ద ముగిసింది. అదే సమయంలో, నాస్‌డాక్ కాంపోజిట్ 0.34% తగ్గి 21,100 వద్ద, ఎస్ అండ్ పి 500 0.40% తగ్గి 6,370 వద్ద ముగిశాయి. ఇక ఆగస్టు 21న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో రూ.1,246.51 కోట్ల నికర కొనుగోళ్లు చేయగా, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.2,546.27 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.
Also Read: Another War: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు..అమెరికా అండతో..