Stock Market: రెండో రోజూ బేర్ విలవిల..400 పాయింట్ల దిగువకు సెన్సెక్స్

  దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది. 

New Update
stock market news

stock market news

భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై సుంకాలు విధిస్తాననే ట్రంప్ హెచ్చరిక స్టాక్ మార్కెట్ల(Stock Market)ను అల్లకల్లోలం చేసింది. నిన్న అసలే  నిన్న మార్కెట్ దారుణంగా దెబ్బ తింది. ఒక్క రోజులనే 7 లక్షల కోట్లు ఆవిరి అయిపోయింది. ఈరోజు అమెరికా ఫెడ్ తన ప్రకటనను జారీ చేసింది. దీంతో లాభాల స్వీకరణ కొనసాగింది. కానీ విదేశీ మదుపర్లు మాత్రం విక్రయాలు చేశారు. US సెంట్రల్ బ్యాంక్ నుండి వడ్డీ రేట్లపై అనిశ్చితి పెట్టుబడిదారులలో భయాన్ని సృష్టించింది. ఇది భారత మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది. దీంతో భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కూడా కుప్ప కూలిపోయింది. సెన్సెక్స్(sensex-crash-today) 436 పాయింట్లు పడిపోయి 84,666 వద్ద ముగిసింది. నిఫ్టీ(nifty) కూడా 121 పాయింట్లు పడిపోయి 25,840 వద్ద ముగిసింది.

Also Read :  భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

రెండు రోజులుగా మార్కెట్లో ఎరుపు..

భారత సూచీలు ఈ రోజు మొదలవ్వడమే నిన్న నష్టాలను క్యారీ చేసుకుంటూ అవే నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 84,742.87 పాయింట్ల వద్ద ప్రారంభం అయింది. ఇది రోజంతా కొనసాగింది. ఇంట్రాడే లో కాస్త కోలుకున్నప్పటికీ...రోజు ముగిసేసరికి మాత్రం 436.41 పాయింట్ల నష్టంతో 84,666.28 వద్ద ముగిసింది.డాలరుతో రూపాయి మారకం విలువ 89.88గా ఉంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 22 క్షీణించగా, 8 లాభాలను నమోదు చేశాయి. ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా 4% క్షీణించింది. ఐటీ రంగం అత్యధికంగా 1.19% క్షీణించింది.  టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా తీవ్రంగా నష్టపోయాయి.

Also Read :  డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్‌ ప్రకటించిన కంపెనీ

ప్రపంచ మార్కెట్లూ పతనం..

భారత స్టాక్ మార్కెట్టే(Stock Market Losses Today) కాదు.. ప్రపంచ మార్కెట్లు కూడా ఈరోజు కింది చూపుల చూశాయి. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ 0.14% పెరిగి 50,655 వద్ద ముగియగా.. కొరియా కోస్పి 0.27% తగ్గి 4,143 వద్ద ముగిసింది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.29% తగ్గి 25,434 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.37% తగ్గి 3,909 వద్ద ముగిశాయి. ఇక డిసెంబర్ 8న యఎస్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.45% తగ్గి 47,739.32 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 0.14%,  S&P 500 0.35% పడిపోయాయి. 

Advertisment
తాజా కథనాలు