New Update
/rtv/media/media_files/2025/12/09/market-share-2025-12-09-19-37-25.jpg)
Market Share Dominance Across Telecom, Banking, Automobile, Airports Sectors
ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్, ఎయిర్‌పోర్ట్స్ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ప్రతిరోజూ మనం ఈ సేవలపైనే ఆధారపడుతున్నాం. అయితే ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్(markets)లో ఎంత షేర్ ఉందనేది చాలామందికి ఓ సందేహం ఉంటుంది. ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం.
Also Read : ఆస్ట్రేలియా కొత్త చట్టం.. 16ఏళ్ల లోపు పిల్లలకు నో ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఫేస్బుక్..!
1.టెలికమ్యూనికేషన్స్
రిలయన్స్ జియో: భారత్‌లో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్. ఈ సంస్థకు ఈ రంగంలో ఏకంగా 41.4 శాతం అత్యధిక వాటా కలిగిఉంది. 2016లో జియో 4G ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ సమయంలో పెద్దఎత్తున వినియోగదారులు జియోకు మారిపోయారు. 2025 నాటికి ఈ సంస్థ 40 శాతానికి పైగా వాటాతో టెలికమ్యూనికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉంది.
భారతి ఎయిర్‌టెల్ :
భారతీ ఎయిర్‌టెల్ దేశంలో రెండో అతిపెద్ద ఆపరేటర్‌గా కొనసాగుతోంది. మార్కెట్‌లో దీనికి 33.6 శాతం వాటా ఉంది.
వోడాఫోన్ ఐడియా:
గతంలో ఐడియా, వోడాఫోన్ సంస్థలు వేర్వేరుగా సేవలు అందించేవి. అయితే 2018 ఆగస్టులో వోడాఫోన్ ఐడియా, ఐడియా సెల్యూలార్ వీలినం జరిగింది. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియాకు మార్కెట్‌లో 17.1 శాతం వాటతో మూడో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీగా కొనసాగుతోంది.
BSNL+MTNL:
ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)కు కలిపి మార్కెట్‌లో 7.90 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎంటీఎన్‌ఎల్ అనేది BSNLకు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.
20 ఏళ్ల టెలికమ్యూనికేషన్ కంపెనీల వాటా
20 ఏళ్ల క్రితం భారతీ ఎయిర్‌టెల్.. టెలికమ్యూనికేషన్ రంగంలో అగ్రగ్రామిగా కొనసాగింది. మార్కెట్‌లో దీనివిలువ 24.5 శాతంగా ఉండేది. ఆ తర్వాత BSNL 23.5 శాతంతో రెండో స్థానంలో ఉండేది. హచ్/వోడాఫోన్‌కు 15.5 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. రిలయన్స్ ఇన్ఫోకామ్ 14.0 శాతం, ఐడియా సెల్యులార్ 10 శాతంతో వరుసగా నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నాయి.
2. మొబైల్స్
వివో: దేశంలో మొబైల్స్ వినియోగించేవారిలో ఎక్కువమంది వివో ఫోన్‌నే వాడుతున్నారు. 2024-25లో ఈ కంపెనీ తమ అమ్మకాల మార్కెట్‌లో 18 నుంచి 24 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది.
ఒప్పో: ఒప్పో 13 నుంచి 16 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది.
శామ్‌సంగ్: 12.6 నుంచి 13 శాతం వాటాతో శామ్‌సాంగ్ మూడో స్థానంలో ఉంది.
షియోమి: చైనాకు చెందిన షియోమి భారత్‌లో కూడా తమ ఉనికిని బలంగా చాటుకుంటోంది. ఈ సంస్థ 9.2 నుంచి 13 శాతం వాటాతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
రియల్‌మీ: యువ వినియోగదారులే టార్గెట్‌గా రియల్‌మీని 2018లో స్థాపించారు. ఆ కంపెనీ ఆన్‌లైన్‌లో బడ్జెట్‌ఫ్రెండ్లీ 5G ఫోన్లను అందిస్తోంది.
ఆపిల్: ఖరీదైన మొబైల్‌గా గుర్తింపు పొందిన ఆపిల్‌కు భారత్‌లో దాని మార్కెట్ విలువ 9 నుంచి 10.4 శాతం వరకు ఉంది.
20 ఏళ్ల క్రితం
20 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఎక్కువ మంది నోకియాను వినియోగించేవారు. ప్రతిఒక్కరి ఇంట్లో కూడా ఈ నోకియా మొబైల్ ఉండేది. ముఖ్యంగా 1100, 3310 సిరీస్‌లు అత్యంత ప్రజాదరణ పొందాయి. నోకియాకు ఆ సమయంలో 60-70 శాతం మార్కెట్ షేర్ ఉండేది. ఆ తర్వాత శామ్‌శాంగ్ 5-7 శాతం, మోటరోలా 5 నుంచి 7 శాతం, సోనీ ఎరిక్సన్‌కు 3 నుంచి 5 శాతం వాటా ఉండేది.
3.ఆటోమొబైల్స్
మారుతి సుజుకి: దేశవ్యాప్తంగా ఎక్కవమంది వినియోగించే వాహనాలు మారుతి సుజుకి సంస్థకు చెందినవే. ఈ కంపెనీకి మార్కెట్‌లో ఏకంగా 41 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది.
టాటా మోటార్స్: టాటా మోటార్స్ 21.6 శాతం వాటాతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎస్‌యూవీలు (నెక్నాన్, పంచ్), అలాగే ఎలక్ట్రిక్ వాహనాల(EV) విభాగంలో అగ్రగ్రామిగా కొనసాగుతోంది.
మహీంద్రా అండ్ మహీంద్రా: మహీంద్రా కంపెనీ SUV (స్కార్పియో-ఎన్, ఎక్స్‌యూవీ700) పై ఫోకస్ పెట్టి వేగంగా తన వాటా పెంచుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ 19.4 శాతం మార్కెట్ షేర్‌తో మూడో స్థానంలో ఉంది.
హ్యుండాయ్: క్రెటా వంటి మోడళ్లతో మధ్యశ్రేణి SUVలలో ఈ కంపెనీకి 12 శాతం ఉంది.
టయోటా: ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి ప్రీమియం విభాగంలో టయోటా బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. దీనికి మార్కెట్‌లో 7.2 శాతం వాటా ఉంది.
కియా ఇండియా: 2019లో కియా ఇండియాను ప్రారంభించారు. సెల్టోస్, సోనెట్ వంటి మోడళ్లతో త్వరలోనే మార్కెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థకు 6.1 శాతం వాటా ఉంది.
20 ఏళ్ల క్రితం
20 ఏళ్ల క్రితం కూడా మారుతి కంపెనీకే పాపులారిటీ ఉండేది. అప్పట్లో మారుతి 800 మంచి గుర్తింపు దక్కించుకుంది. అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఈ కంపెనీకి అప్పట్లో 42 శాతం వాటాతో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆ తర్వాత టాటా మోటార్స్ 20.7 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. హ్యూండాయ్ 12.8 శాతంతో మూడో స్థానంలో ఉండేది. ఇక మహీంద్రా, టయోటా, హోండా లాంటి కంపెనీలు అప్పుడప్పడే తమ మార్కెట్ విలువను పెంచుకుంటూ వస్తున్నాయి.
4.పెట్రోలియం
పెట్రోలియం రంగంలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలే తమ ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.
1. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)
ఇది భారత్‌లో అతిపెద్ద పెట్రోలియం సంస్థ. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం 45 శాతం ఉంది.
2. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL)
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 25 శాతం వాటాతో రెండో స్థానంలో కొనసాగుతోంది
3. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL)
ఈ సంస్థ 20 శాతం వాటాతో మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఇక ప్రైవేటు ఇతర అంతర్జాతీయ సంస్థల కంపెనీలకు 10 శాతం వాటా ఉంది.
20 ఏళ్ల క్రితం
IOCL, BPCL, HPCLకు 98 శాతానికి పైగా వాటా ఉండేది. మిగిలిన రెండు శాతం ప్రైవేటు సంస్థలకు ఉండేది.
5.బ్యాంకింగ్
బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు 60 శాతం వాటా ఉంది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పెద్దది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా లాంటి బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో దాదాపు 35 శాతం వాటా ఉంది. ఇందులో HDFC , ICICI, యాక్సిస్ బ్యాంకులు ప్రధానమైనవి. ఇందులో HDFC అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతోంది. ఇక విదేశీ, ఇతర బ్యాంకులకు దాదాపు 5 శాతం వాటా ఉంది.
20 ఏళ్ల క్రితం
20 ఏళ్ల క్రితం ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు 75 నుంచి- 80 శాతం వాటా ఉండేది. ప్రైవేట్ రంగ బ్యాంకులకు దాదాపు 15 నుంచి -20 శాతం షేర్ ఉండేది. HDFC, ICICI , యాక్సిస్ బ్యాంకులు అప్పుడే మార్కెట్లో కొత్తగా బలపడుతున్నాయి. ఇక విదేశీ, ఇతర బ్యాంకులకు 5 శాతం షేర్ ఉండేది.
6.విమానయాన సంస్థలు
విమానయాన సంస్థల్లో ప్రస్తుతం ఇండిగో 65.6 శాతం వాటాతో దేశంలో అగ్రగ్రామిగా కొనసాగుతోంది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా గ్రూప్ 25.7 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆకాశా ఎయిర్ 5.2 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. స్పెస్‌జెట్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇతరులకు 0.9 శాతం షేర్ ఉంది.
20 ఏళ్ల క్రితం
20 ఏళ్ల క్రితం జెట్ ఎయిర్‌వేస్ 34 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండేది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ 21 శాతంతో రెండో స్థానం, ఎయిర్ డెక్కన్ 19 శాతంతో మూడో స్థానంలో ఉండేది. ఎయిర్ సహారా 9 శాతం, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 8 శాతం, స్పైస్‌జెట్ 6 శాతం, గో ఎయిర్ 2 శాతం, ఇతరులకు 1 శాతం వాటా ఉండేది.
7.ఎయిర్‌పోర్ట్స్
1.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)
ఎయిర్‌పోర్ట్స్ రంగంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కు 45 నుంచి 50 శాతం వాటాతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. చిన్న, మధ్యతరహా ఎయిర్‌పోర్టులను AAI నిర్వహిస్తోంది.
2.జిఎమ్ఆర్ ఎయిర్‌పోర్ట్స్
GMR ఎయిర్‌పోర్ట్స్‌కు 25 నుంచి 30 శాతం వాటా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ఎయిర్‌పోర్టులను జీఎంఆరే నిర్వహిస్తోంది.
3.అదానీ గ్రూప్
అదానీ గ్రూప్‌కు ఎయిర్‌పోర్టు నిర్వహణలో 15 నుంచి 20 శాతం వాటా ఉంది. ముంబై , అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు నిర్వహిస్తోంది.
ఇతరులు, ప్రైవేటు కంపెనీలకు 5 నుంచి 10 శాతం వాటా ఉంది.
20 ఏళ్ల క్రితం
20 ఏళ్ల క్రితం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కు 95 శాతానికి పైగా వాటా ఉంది. దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలను AAI నిర్వహించేది. ఇక ప్రైవేట్ సంస్థలకు సుమారు 5 శాతం వాటా ఉంది.
8.షిప్స్
షిప్స్ రంగంలో ప్రభుత్వ రంగ డిఫెన్స్ షిప్‌యార్డ్స్‌కు 70 నుంచి 80 శాతం వాటా ఉంది. మాజ్‌గావ్ డాక్ లిమిటెడ్ (MDL), గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE), కోచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) వంటి సంస్థలు ఈ వాటాను కలిగి ఉన్నాయి. ఇక ప్రైవేట్ షిప్‌యార్డ్స్ కు 20 నుంచి 30 శాతం వాటా ఉంది. ఇందులో లార్సెన్ అండ్ టూబ్రో (L&T), ఏబీజీ షిప్‌యార్డ్ (ABG - ప్రస్తుతం కార్యకలాపాలు తగ్గాయి), భారతి షిప్‌యార్డ్ వంటి సంస్థలు ఈ వాటాను కలిగి ఉన్నాయి.
20 ఏళ్ల క్రితం
ప్రభుత్వ రంగ షిప్‌యార్డ్స్ 90 శాతానికి పైగా మార్కెట్‌లో షేర్ ఉండేది. MDL, GRSE, CSL, అప్పటి హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ (HSL) వంటి సంస్థలు ఈ వాటాను కలిగి ఉండేవి.ఇక ప్రైవేటే షిప్‌యార్ట్స్‌కు 10 శాతం వాటా ఉండేది. ఇవి కేవలం చిన్న చిన్న మరమ్మత్తులు లేదా చిన్న నౌకల నిర్మాణానికి మాత్రమే పరిమితమయ్యేవి.
Follow Us