/rtv/media/media_files/2025/12/25/uber-2025-12-25-10-21-43.jpg)
కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్(ride-hailing apps)లకు సంబంధించి ప్రయాణికుల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా అడ్వాన్స్ టిప్పింగ్(advance tipping) పై నిషేధం విధించారు. ఇప్పటివరకు చాలా క్యాబ్ యాప్‌లలో రైడ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్‌కు టిప్ ఇచ్చే సదుపాయం ఉండేది. దీనివల్ల ఎక్కువ టిప్ ఇచ్చేవారికే డ్రైవర్లు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది ఒక రకమైన 'వేలం పాట'లా మారిందని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇకపై రైడ్ బుక్ చేసే సమయంలో లేదా ప్రయాణం మధ్యలో టిప్ ఆప్షన్ కనిపించకూడదు. ప్రయాణం పూర్తిగా ముగిసిన తర్వాతే స్వచ్ఛందంగా టిప్ ఇచ్చే ఫీచర్ అందుబాటులో ఉండాలి. ప్రయాణికుడు ఇచ్చే టిప్ మొత్తంలో యాప్ సంస్థలు ఎలాంటి కమిషన్ తీసుకోకూడదు. ఆ నగదు 100% డ్రైవర్‌కే చెందాలి. - indian-government
అలాగే మహిళల కోసం 'మహిళా డ్రైవర్ ఆప్షన్’(female driver)ను తీసుకురావాలని ఆదేశించారు. మహిళా ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచే దిశగా కేంద్రం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులు తమ రైడ్ కోసం మహిళా డ్రైవర్‌నే ఎంచుకునే సదుపాయాన్ని యాప్‌లు కల్పించాలి. అయితే, ఇది డ్రైవర్ల లభ్యతను బట్టి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో గిగ్ ఎకానమీలో మహిళా డ్రైవర్ల సంఖ్య 1% కంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఈ నిర్ణయం వల్ల మరిన్ని సంస్థలు మహిళా డ్రైవర్లను చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : డేటింగ్ చేసే జంటకు రూ.30 వేలు.. గవర్నమెంట్ బంపరాఫర్
సురక్షితమైన ప్రయాణం కోసం మరిన్ని ఫీచర్లు
టిప్పింగ్ పేరుతో ప్రయాణికులను తప్పుదోవ పట్టించేలా లేదా ఒత్తిడికి గురిచేసేలా యాప్‌లు వ్యవహరిస్తే, అవి వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలకు గురవుతాయి. ఈ సవరణలను తక్షణమే అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) మే 2025లో ఈ 'అడ్వాన్స్ టిప్పింగ్' పద్ధతిని "అన్యాయమైన వ్యాపార విధానం"గా గుర్తించింది. కేవలం డబ్బులు అదనంగా ఇస్తేనే కారు వస్తుందనే భ్రమ కల్పించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేసింది. ఈ నిర్ణయాల వల్ల సామాన్యులకు తక్కువ ధరలో క్యాబ్ సేవలు అందడమే కాకుండా, రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలకు మరింత భద్రత లభించనుంది.
Also Read : విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేసిన థాయ్ సైనికులు.. ఇండియా వార్నింగ్
Follow Us