Govt App: ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌.. డిలేట్‌ కూడా చేయలేరు..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే మొబైళ్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్డ్‌గా అందించాలని సూచనలు చేసింది. ఈ మేరకు మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  

New Update
India orders phone companies to install govt cyber safety app in every phone

India orders phone companies to install govt cyber safety app in every phone

ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకుండా ఎవరూ ఉండలేరు. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలామంది గుర్తుతెలియని లింకులు నొక్కి, ఓటీపీలు, బ్యాంకు ఖాతా సమాచారం అందించి సైబర్ నేరగాళ్ల(cyber scam india) వలలో పడుతున్నారు. ఇలా ఎంతోమంది వేలు, లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అలాగే ఫోన్లు కూడా పొగొట్టుకుంటున్నారు. వీటిని అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే మొబైళ్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్డ్‌గా అందించాలని సూచనలు చేసింది. ఈ మేరకు మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  

Also Read: విచ్చలవిడి శృంగారం..అడ్డు అదుపులేని లైంగిక సంబంధాలతో..ఎయిడ్స్‌ విజృంభన

Install Govt Cyber Safety App In Every Phone

ఇక వివరాల్లోకి వెళ్తే భారత్‌లో 100 కోట్లకు పైగా మొబైల్స్‌ను వాడుతున్నారు. సైబర్ నేరాలు, ఫోన్‌ చోరీ కేసులు నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. పొగోట్టుకున్న మొబైల్స్‌ను గుర్తించేందుకు ఈ ఏడాది జనవరిలో కేంద్రం 'సంచార్‌ సాథీ' అనే యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ సాయంతో ఇప్పటిదాకా దాదాపు 7 లక్షలకు పైగా చోరీ అయిన ఫోన్లను గుర్తించింది. పోగొట్టుకున్న ఫోన్లను కనిపెట్టడంతో పాటు సైబర్ సెక్యూరిటీ ముప్పును ఎదుర్కోవడంలో ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్రం భావించింది. 

అందుకే ఈ యాప్‌ను కొత్తగా వచ్చే అన్ని ఫోన్లలో డిఫాల్డ్‌గా ఉండేలా టెలికాం సంస్థలకు కేంద్ర టెలికా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇతర యాప్‌లలాగ ఈ యాప్‌ను డిలీట్ చేయడమనేది కుదరదు. అంతేకాదు ఈ యాప్‌ను కొత్త ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం 90 రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సప్లయ్‌ చైన్‌లో ఉన్నటువంటి స్మార్ట్‌ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ ద్వారా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించాలని సూచనలు చేసినట్లు సమాచారం. 

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..RTC బస్సులు ఢీకొని 11 మంది మృ‌తి

మరోవైపు ప్రొప్రయిటరీ యాప్‌లు తప్ప ప్రభుత్వ లేదా థర్డ్‌ పార్టీ యాప్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేసేందుకు యాపిక్ అనుమతించదు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను గతంలో యాపిల్‌ తిరస్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి కూడా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి యాపిల్ సంస్థ వ్యతిరేకంగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ప్రభుత్వం గానీ లేదా ఇతర మొబైల్ తయారీ కంపెనీలు ఇంకా స్పందించలేదు. మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు