Mahila Samman Scheme: మహిళా సమ్మాన్ స్కీమ్.. బడ్జెట్‌లో గడువు పెంచుతారా?

2023-24 బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ గడువు మార్చి 31వ తేదీతో పూర్తి కానుంది. దీని గడువును కేంద్రం బడ్జెట్‌లో పొడిగించే సూచనలు ఎక్కువగా ఉన్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

New Update
Nirmala Seetharaman

Nirmala Seetharaman

Mahila Samman Scheme: మహిళల కోసం కేంద్రం 2023-24 బడ్జెట్ సమయంలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనే స్కీమ్‌ను తీసుకొచ్చింది. చాలా తక్కువ కాలంలోనే ఈ స్కీమ్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో మహిళలు డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్‌లో ఒకేసారి డబ్బులు అన్ని డిపాజిట్ చేయవచ్చు. అలాగే మూడు నెలల గ్యాప్‌తో ఎన్ని అకౌంట్లు అయినా కూడా ఓపెన్ చేయవచ్చు. 

ఇది కూడా చూడండి:  USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి

రెండేళ్ల పాటు..

ఈ మహిళా సమ్మాన్ పథకాన్ని కేంద్రం 2023లో ప్రారంభించింది. ఆ సమయంలో 2025 మార్చి 31వ తేదీ లాస్ట్ అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకంలో చేరిన తేదీ నుంచి రెండేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఈ రోజు అనగా జనవరి 30వ తేదీన ఈ స్కీమ్‌లో చేరారనుకోండి.. అది 2027 జనవరి 30వ తేదీ వరకు మెచ్యూరిటీ వస్తుంది. ఈ స్కీమ్‌లో అందరు మహిళలు కూడా చేరవచ్చు. మైనర్‌గా ఉన్నవారు గార్డియెన్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 

ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!

మహిళలకు ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇనిషియేటివ్‌లో భాగంగానే దీన్ని తెచ్చారు. అయితే ఈ స్కీమ్‌లో వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వడ్డీ రేటు ఉంది. దీన్ని ఏడాది తర్వాత 40 శాతం వరకు డబ్బుల్ని తీసుకోవచ్చు. ఇందులో రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

వడ్డీ రేటు బట్టి మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. ఉదాహరణకు మీరు రూ.2 లక్షలు ఈ స్కీమ్‌లో జమ చేస్తే మెచ్యూరిటీకి రూ.32,044 వడ్డీ వస్తుంది. ఈ పథకానికి మంచి ఆదరణ లభించింది. అయితే ఈ స్కీమ్‌ను పొడిగిస్తారా? లేకపోతే పెంచుతారా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే గడువు పొడిగించే సూచనలు ఎక్కువగా ఉన్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ స్కీమ్ గురించి బడ్జెట్‌లో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు