/rtv/media/media_files/2025/04/16/vTtFtGBMNQm9QEEnjPdB.jpg)
zaheer-khan
టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య, నటి సాగరిక ఘట్గే మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఇదే వీరికి తొలి సంతానం కావడం విశేషం. ఈ జంట ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఆ మగబిడ్డకు ఫతేసిన్హ్ ఖాన్ అని నామకరణం చేసినట్లుగా తెలిపారు. ఈ జంటకు అభిమానులు. తొటి క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
Zaheer Khan & his wife blessed with a Baby Boy ❤️
— Johns. (@CricCrazyJohns) April 16, 2025
- Congratulations to both of them. pic.twitter.com/3vVj5gVuMD
ముంబైలో హ్యాపీగా లైఫ్ లీడ్
కాగా చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్న జహీర్, సాగరిక నవంబర్ 2017లో వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి వీరిద్దరూ ముంబైలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ప్రస్తుతం ఐపీఎల్ లో జహీర్ ఖాన్ బిజీగా ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌గా మెంటార్‌గా ఉన్నాడు.
'Precious little baby boy': Zaheer Khan, wife Sagarika welcome first childhttps://t.co/75r2TlbCAg@ImZaheer #Motherhood #Parenting @harbhajan_singh @sagarikavghatge #FatehsinhKhan #BabyBoy #CelebrityNews #FamilyPortrait #LoveAndGratitude #ZaheerKhanLegacy @oh_women pic.twitter.com/Mp2rXoJ5DG
— Oh Women (@oh_women) April 16, 2025
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో 4 విజయాలతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది లక్నో టీమ్. మహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల జహీర్ ఖాన్.. లెఫ్టార్మ్ మీడియం పేసర్. 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లలో 17 వికెట్లు తీశాడు.
Also Read : ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. హైదరాబాదీనే సూత్రధారి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!