wife and daughter inlaw met chandrabu:చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ ములాఖత్

చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ. బాబుతో ములాకత్ అయ్యేందుకు ముగ్గురూ జైలు లోపలికి వెళ్ళారు. ఈరోజు లోకేష్ కు సీబీఐ నోటీసులు ఇవ్వడానికి బయలుదేరిన విషయఆన్ని వీరు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.

wife and daughter inlaw met chandrabu:చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ ములాఖత్
New Update

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో సతీమణి భువనేశ్వరి,కోడలు బ్రాహ్మణి ములాకత్ ముగిసింది. నాలుగోసారి వీరు బాబును కలవడానికి వచ్చారు. వీరితో పాటూ మాజీ మంత్రి నారాయణ కూడా ఉన్నారు. మీటింగ్ తర్వాత నారాయణ మాట్లాడుతూ... వ్యవసాయ రంగానికి చెందిన Ns స్వామినాథన్ మృతికి చంద్రబాబు సంతాపం తెలపాలని చెప్పారన్నారు. తనకు మద్దతు తెలిపిన వారందరికి ధన్యవాదాలు చెప్పమన్నారన్నారు.  ఐదు రోజుల ప్రోగ్రాం తో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారని ఓర్వలేక వైసిపి ప్రభుత్వం కుట్ర పన్నింది.ఇన్నర్ రింగ్ రోడ్ నా సొంత ల్యాండ్ 2001 లో కొన్నాను..అందులో 40సెంట్లు పోయింది.దాని విలువ ఏడుకోట్లు...అందులో నేనేం అవినీతి చేస్తాను. పవన్ కళ్యాణ్ కలయికతో ఇద్దరం కలిసి ఉమ్మడి కార్యచరణ తో వెళ్తామని చంద్రబాబు చెప్పారని నారాయణ అన్నారు. దీంతో పాటూ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌ ను ఆదేశించింది. దీంతో లోకేష్ యువగళం కూడా ఆగిపోనుంది. ఈ విషయాల గురించి బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణలతో చంద్రబాబు చర్చించారని తెలుస్తోంది. అంతేకాకుండా ఒకవేళ లోకేష్ కూడా అరెస్ట్ అయితే తర్వాత ఏం చేయాలి? ఎవరెవరు ఎలాంటి పనులు చేపట్టాలి అన్న దాని మీద కూడా డిస్కషన్ జరిగిన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఆంధ్ర రాజకీయ పరిణామాల మీద కూడా చర్చించారని సమాచారం.

ఇది కూడా చదవండి:భారత్ తో సన్నిహిత సంబంధాలు కావాలి కానీ…

మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌ ను ఆదేశించింది. లోకేష్‌ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది. 41 ఏ నోటీసు ఇస్తామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని ఏజీ శ్రీరామ్ వివరించారు. దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని లోకేష్‌ కు చెప్పాలని అని కోరారు. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించాలని లోకేష్ ను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ బయలుదేరారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు 41A కింద నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, కేసుల విషయంలో ఆయన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి:రాహుల్ గాంధీతో మైనంపల్లి భేటీ.. టికెట్లపై కీలక హామీ?

#andhra-pradesh #tdp #chandrababu #rajahmundry #nara-brahmani #narayana #mulakath #central-jail #bhuvaneswari #ex-minister
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe