Mynampalli Hanmanth Rao: రాహుల్ గాంధీతో మైనంపల్లి భేటీ.. టికెట్లపై కీలక హామీ?

నిన్న కాంగ్రెస్ లో చేరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. వీరందరికీ రాహుల్ గాంధీ నుంచి టికెట్ విషయంలో స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది.

New Update
Mynampalli Hanmanth Rao: రాహుల్ గాంధీతో మైనంపల్లి భేటీ.. టికెట్లపై కీలక హామీ?

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిపిందే. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు రాహుల్ గాంధీని కలిశారు. వారి వెంట్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఉన్నారు. మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్ గిరి, ఆయన కుమారుడు మెదక్, వేముల వీరేశం నకిరేకల్ టికెట్ ను ఆశిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీరి ముగ్గురికి రాహుల్ గాంధీ నుంచి కూడా టికెట్ పై హామీ లభించినట్లు తెలుస్తోంది.

publive-image రాహుల్ గాంధీతో నేతలు

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీరి చేరిక కార్యక్రమానికి దూరంగా ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. వీరి చేరికను కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. వేముల వీరేశం చేరికపై కోమటిరెడ్డి సానుకూలంగా ఉన్నా.. మైనంపల్లి విషయంలో మాత్రం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది.

this is an updating story

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు