Balakrishna, Pawan kalyan and Nara Lokesh to meet Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్నేహ అప్పర్ బ్లాక్ లో నిన్న రాత్రి తొమ్మిది గంటలకు నిద్రించి బాబు ఈరోజు తెల్లవారు ఝామున 4.30 నిమిషాలకే నిద్ర లేచినట్లు సమాచారం. తరువాత రోజువారి దినచర్యలో భాంగా యోగ చేసి, పేపర్ చదివారు. బ్రేక్ ఫాస్ట్ మెనూలో కూడా ఎప్పటిలానే ఫ్రూట్స్, బ్లాక్ కాఫీ, హాట్ వాటర్ ఉంటాయని సమాచారం.
మరోవైపు ఈరోజు చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హడావుడి నెలకొననుంది. బాబు కలవడానికి బాలకష్ణ, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు రాబోతున్నారు. మొట్టమొదటిసారిగా బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఒకేసారి కలిసి కనిపించనున్నారు. పొలిటికల్ గా ఇదొక పెద్ద విషయమనే చెప్పాలి. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకే వెళతారని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ ఆయన అల్లుడు లోకేష్ వారి క్యాంపు నుంచి అదే సమయానికి వస్తారని సమాచారం. బాబుతో ములాఖత్ అయిన తర్వాత ఇద్దరు నేతలు మీడియా మాట్లాడతారని చెబుతున్నారు.
బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వస్తుండడంతో అక్కడ భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తును పెట్టారు. ప్రభుత్వాసుపత్రి, ఆర్ట్స్ కాలేజి దగ్గర బిరకేడ్లు, దారి మళ్ళింపులు పెట్టారు. బాబును కలిశాక జనసేనాని మధ్యాహ్నం రెండుగంటలకు మళ్ళీ ఎయిర్ పోర్ట్ కే వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళిపోతారని సమాచారం.
బాబును ఇప్పటివరకూ ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, బ్రాహ్మణిలు కలిశారు. అలాగే బాబు తరుఫు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కూడా ములాఖత్ అయ్యారు.
Also Read: చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దలు? ఇప్పటివరకు నోరు విప్పని కమలనాథులు!