ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లా తోడేళ్లు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వీటి దాడిలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందారు. 18 మందికి గాయాలయ్యాయి. తోడేళ్లు రాత్రిపూట దాడులు చేస్తూ దాదాపు 35 గ్రామాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. దీంతో స్థానికులు రాత్రి పూట కాపాలా ఉంటున్నారు. మహిళలు తమ పిల్లలను చీరలతో కట్టేసుకొని పడుకుంటున్నారు. ఈ నరహంతక తోడేళ్ల కోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ బేడియా కొనసాగుతోంది. తోడేళ్లు ఎక్కడా కనిపించినా షూట్ చేయండని ఇప్పటికే సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయితే అటవీ అధికారులకు తాజాగా మరో తోడేలు చిక్కింది. ఇప్పటివరకు 6 తోడేళ్లలో ఐదింటిని పట్టుకున్నారు.
Also read: ఇకపై హైదరాబాద్లో సెల్లార్లకు నో పర్మిషన్?