Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు భారీ ప్యాకేజీని పెంచిన గూగుల్..

గూగుల్ CEO సుందర్‌ పిచాయ్‌కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.

New Update
Google CEO Sundar Pichai

Google CEO Sundar Pichai

గూగుల్ CEO సుందర్‌ పిచాయ్‌(google-ceo-sundar-pichai) కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది. మన భారత కరెన్సీలో రూ.6,316 కోట్లు. ఫైనాన్షియల్ టైమ్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వేతనంలో వార్షిక జీతం 2 మిలయన్‌ డాలర్లుగా ఉంది. పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్‌ (PSU) విలువ 126 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అంటే కంపెనీ అనుకున్న టార్గెట్‌లను చేరుకున్న ఆధారంగా ఇవి సర్దుబాటు అవుతాయి.

Also read: రష్యా నుంచి చమురు కొనేందుకు భారత్‌కు అమెరికా పర్మిషన్ ? ఇందులో వాస్తవం ఎంత..

Google's Sundar Pichai's Total Pay Hiked

అలాగే పరిమిత స్టాక్ వెస్టింగ్‌ ద్వారా 84 మిలియన్ డాలర్లు తీసుకోనున్నారు. కంపెనీ ఉద్యోగికి ఇచ్చే షేర్లు, పదవీకాలం పూర్తయిన లేదా పనీతీరు ఆధారంగా ఇవి ఉద్యోగికి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మరోవైపు ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థలు వ్యోమో, వింగ్ ఏవియేషన్లలోని 175 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కేటాయించారు. ఈ రెండు కంపెనీలు ఇచ్చే ప్రోత్సహకాలు సుందర్‌ పిచాయ్‌ లీడర్‌షిప్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని బోర్డు తెలిపింది.  

Also Read: పశ్చిమాసియాలో యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో మనవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ? లెక్కలు ఇవే

ఇదిలాఉండగా సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌ కంపెనీలో చేరారు. ఆ తర్వాత కంపెనీలో కీలక బాధ్యతలు స్వీకరిస్తూ వచ్చారు. చివరికి 2015లో గూగుల్‌కు సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఈ పదేళ్ల కాలంలో కంపెనీ మార్కెట్‌ విలువ ఏడు రేట్లు పెరిగింది. సంస్థ ఆదాయం 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరిపోయింది. ఈ ఏడాది జనవరిలో ఓ దశలో అకంగా 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా దాటింది. 

Advertisment
తాజా కథనాలు