/rtv/media/media_files/2026/03/07/iran-president-apologises-to-neighbours-for-attacks-2026-03-07-15-33-54.jpg)
Iran President apologises to neighbours for attacks
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు(iran israel war) చేస్తుండగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాలపై దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని తెలిపారు.
Also Read: కొనసాగుతున్న భీకర యుద్ధం.. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వాడుతున్న ఆయుధాలు ఇవే !
Iran President Apologises To Neighbours For Attacks
మాపై దాడులు చేయకుంటే మేము కూడా దాడులు చేయమని అన్నారు. ఇప్పటినుంచి గల్ఫ్ దేశాలను అమెరికా(iran us war) సైనిక స్థావరాలుగా మార్చకండని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని అన్నారు. అయితే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కువైట్, సౌదీ అరేబియా, దుబాయ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల వద్ద కూడా దాడులు చేసింది. ఖతార్, సౌదీలోని చమురు, గ్యాస్ కేంద్రాలపై కూడా విరుచుకుపడింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ అధ్యక్షుడు తాజాగా గల్ఫ్ దేశాలకు సారీ చెబుతూ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ఈ రాత్రికి ఇరాన్ ఖతం.. బిగ్ అటాక్ కు అమెరికా స్కెచ్.. సంచలన కథనాలు!
Follow Us