/rtv/media/media_files/2026/03/06/trump-2026-03-06-21-52-50.jpg)
‘No deal with Iran except unconditional surrender, says Trump
మిడిల్ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ మరోసారి సంచలన హెచ్చరిక చేశారు. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పారు. బేషరతుగా లొంగిపోవాల్సిందేనన్నారు. ఇరాన్‌కు త్వరలో సరైన నాయకుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు. మిత్రపక్షాలతో కలిసి ఇరాన్‌ను సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎప్పుడు లేనట్లుగా ఇరాన్‌ను ఆర్థికంగా మెరుగైన స్థితికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
Also Read: డిజిటల్ జనాభా లెక్కలు.. సెన్సస్-2027 షెడ్యూల్ విడుదల
ఇరాన్‌కు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇదిలాఉండగా మిడిల్ఈస్ట్లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేస్తుండగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. అయితే ఈ యుద్ధం విషయంలో పలు దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ అధ్యక్షుడుు మసౌద్ పెజెష్కియన్ చెప్పారు. కానీ ఏ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: ఎప్స్టీన్ ఫైల్స్.. ట్రంప్‌పై మరిన్ని సంచలన ఆరోపణలు
ఇరాన్లో శాశ్వత శాంతికి కట్టుబడి ఉన్నట్లు మసౌద్ వెల్లడించారు. దేశ గౌరవం, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఇదిలాఉండగా ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్లో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ లొంగిపోయేవరకు తాము దాడులు చేస్తూనే ఉంటామని ట్రంప్ ఇప్పటికే చెప్పారు.
Follow Us