Gulf: పశ్చిమాసియాలో యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో మనవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ? లెక్కలు ఇవే

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది. గల్ఫ్‌ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో కూడా పలు దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు ఈ యుద్ధ వాతావరణంలో భయంభయంగా గడుపుతున్నారు.

New Update
indian population in gulf countries

indian population in gulf countries

పశ్చిమాసియా(west-asia) లో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు(Iran attacks Gulf countries) చేస్తోంది. గల్ఫ్‌ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో కూడా పలు దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దుబాయ్‌లోని పామ్ జుమేరా, బుర్జ్ అల్ అరబ్ సమీప ప్రాంతాల్లో శకలాలు పడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు ఈ యుద్ధ వాతావరణంలో భయంభయంగా గడుపుతున్నారు. 

Also Read: ‘ప్రపంచ కుబేరుల జాబితా'లో మన స్థానం ఎంతో తెలుసా?

Indian Population In Gulf Countries

కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలోని ఓ సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది. గల్ఫ్‌దేశాల్లో భారతీయులను వెనక్కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే గల్ఫ్‌ దేశాల్లోని ఏ దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

UAE: 43.26 లక్షలు
బహ్రెయిన్‌: 3.1 లక్షలు
ఖతార్: 8.30 లక్షలు
కువైట్:10.36 లక్షలు
సౌదీ అరేబియా: 27.47
ఒమన్‌: 6.76 లక్షలు
ఇజ్రాయెల్:10,500 
ఇరాన్:10,765
ఇరాక్:17,100
జోర్డాన్:17,050
లెబనాన్:3,040

Also Read: యుద్ధంలో కీలక పరిణామం.. గల్ఫ్‌ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

మొత్తంగా గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల నుంచి కోటి మంది భారతీయులు ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు.  తెలంగాణలో 15 లక్షల నుండి 18 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లా వాసులున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా వాసులున్నారు. 

Advertisment
తాజా కథనాలు