Watch Video: విద్యార్థులతో హెడ్‌మాస్టర్‌ మసాజ్‌.. వీడియో వైరల్‌

ప్రభుత్వ పాఠశాలల్లో ఓ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్‌ చేయించుకోవడం కలకలం రేపింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రంగంలోకి దిగిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.

New Update
Headmaster suspended after a viral video showed students giving her a body massage

Headmaster suspended after a viral video showed students giving her a body massage

ప్రభుత్వ పాఠశాలల్లో ఓ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్‌ చేయించుకోవడం కలకలం రేపింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రంగంలోకి దిగిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌ జిల్లాలో కార్వి ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడి స్కూల్‌లో మధు కుమారి అనే మహిళ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. 

Also Read: క్యాన్సర్‌ను జయించి UPSCలో సత్తా చాటిన సంజయ్.. సక్సెస్ స్టోరీ వింటే గూస్‌బంప్సే!

అయితే ఇటీవలే పాఠశాల విద్యార్థినులతో మసాజ్‌ చేయించుకుంది. పిల్లలతో నడుము, కాళ్లు, పాదాల వద్ద తొక్కించుకుంది. ఈ దృశ్యాలను అక్కడున్న వాళ్లలో ఒకరు వీడియో తీయగా.. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేశారు. అధికారులు తనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో  విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్కూల్ తనిఖీ కోసం ఓ టీమ్‌ను పంపారు. కానీ మధు కుమారి అక్కడ కనిపించలేదు. ఆమె సిక్ లీవ్ తీసుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు.

Also Read: వార్ దెబ్బ.. దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

దీంతో విద్యార్థుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. వాళ్లు చెప్పిన ఆధారాల మేరకు మధు కుమారిని సస్పెండ్ చేశారు. తనను సస్పెండ్‌ చేయడంపై ఆమె స్పందించింది. ఆ వీడియోలో ఉంది తాను కాదని.. ఏఐ ఆధారిత వీడియో సృష్టించిట్లు ఆరోపణలు చేస్తోంది.  

Advertisment
తాజా కథనాలు