YS Viveka murder case : వైఎస్ వివేకా హత్యకేసులో బిగ్ ట్విస్ట్..ప్రధాన సాక్షి మృతి
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎటు తేలడం లేదు. జగన్ ప్రభుత్వ హయాంలో కేసు కొలిక్కి వస్తుందని భావించినప్పటికీ అదీ జరగలేదు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉండగానే ప్రధాన సాక్షి ఒకరు మరణించడంతో కేసు మలుపు తిరిగింది.