/rtv/media/media_files/2025/03/05/wjt18eV76eUqgdzbblvO.jpg)
_pavan vs jagana Photograph: (_pavan vs jagana)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో YSRCP పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ జీవితకాలంలో ఈ ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారని జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
Also read: Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన!
పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ.. MLA కి తక్కువ..!
— RTV (@RTVnewsnetwork) March 5, 2025
జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు..
డిప్యూటీ సీఎం పవన్ పై జగన్ సంచలన కామెంట్స్.. @PawanKalyan#YSJagan#AndhraPradesh#RTVpic.twitter.com/iHQZ6pgojA
Also Read : ఏపీలో మహిళా రైడర్లు..ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ప్రతిపక్షాన్ని గుర్తించపోతే ప్రభుత్వ తప్పులను ఎవరు ఎత్తిచూపుతారని జగన్ ప్రశ్నించారు. మా ప్రభుత్వం అధికారంలో ఉండగా చంద్రబాబుకు అసెంబ్లీలో మాట్లాడమని మైక్ ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం దగ, మోసం, వంచన ఇలా అన్నీ చేసిందని మండిపడ్డారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగులను మొత్తం వరుసపెట్టి తొలగిస్తున్నారని వైసీపీ నేత ఆగ్రహం వ్యక్తి చేశారు. మా ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించామని ఆయన అన్నారు. వైసీపీ గవర్నమెంట్ ఐదేళ్లలో 6,31,310 ఉద్యోగాలు ఇచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిందని, ఇప్పటివరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలోనూ మోసం తప్ప ఏమీ లేదన్నారు.