Sharmila: జగనన్నను వదలని షర్మిల.. ఆ కుట్రలో కర్త, కర్మ, క్రియ అంటూ సంచలన ఆరోపణలు!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోమారు మాజీ సీఎం తన సోదరుడు జగన్మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి, జగన్ కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కేలేదని షర్మిళ ఖరాఖండిగా అన్నారు.

New Update
Sharmila on Jagan

Sharmila on Jagan

Sharmila: ఏపీ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోమారు మాజీ సీఎం తన సోదరుడు జగన్మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి, జగన్ కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కేలేదని షర్మిళ ఖరాఖండిగా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై షర్మిళ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగాకూటమి ప్రభుత్వంతో  పాటు, వైసీపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు.

Also Read:  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి పచ్చి అబద్ధాలని విమర్శించారు.- మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజాలను దాచి పెడుతున్నారన్నారు. రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టులో జీవం తీసేశారన్నారు.ఎత్తు తగ్గించి 194 TMCల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 TMCలకు పరిమితం చేశారని విమర్శించారు. - 22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ..- సాగునీరు అందించే వైఎస్సార్‌ నిర్ధేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారన్నారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్‌ అనుకుంటే.. - 41.15 మీటర్ల ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్‌గా మార్చుతున్నారన్నారు. - నీటి నిల్వకు తప్పా ఎందుకు పనికి రాని ప్రాజెక్టుగా చేస్తున్నారని షర్మిల విమర్శించారు.

Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

- 41.15 మీటర్ల ఎత్తుకి, రూ.30,436 కోట్ల బడ్జెట్ అంచనాలను కేంద్రం ఆమోద ముద్ర వేస్తే.. 45.72 మీటర్ల ఎత్తులో కట్టి తీరుతాం అని అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి అవాస్తవాలు కావా ? అనికూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అయితే, ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే,  - కేంద్ర ప్రభుత్వంతో వెంటనే అధికారిక ప్రకటన చేయించండి. - తక్షణమే ప్రాజెక్టు కొత్త DPR బయటపెట్టండని డిమాండ్‌ చేశారు. అఖిలపక్షాన్ని పిలిచి నిజానిజాలు చెప్పండి. పునరావాస చర్యలకే రూ.30వేల కోట్లు దాటుతుంటే, తీసుకుంటున్న చర్యలు ఏంటో వివరించండని షర్మిల కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Also Read:  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వైఎస్సార్‌  జీవిత ఆశయం పోలవరం..

వైసీపీకి, జగన్ కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కేలేదని షర్మిళ తేల్చి చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతికత వైసీపీ పార్టీకి లేదు. పోలవరం ప్రాజెక్టు పేరు వింటే వైఎస్సార్‌ గుర్తుకు వచ్చే మీకు 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా ?  అని ప్రశ్నించారు. వైఎస్సార్‌  జీవిత ఆశయం పోలవరం అని మీకు తెలియదా ?  అధికారంలో ఉండగా తట్టెడు మట్టి అయినా తీశారా ? అంటూ ప్రశ్నలు సంధించారు. - ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా ?  నాడు ప్రధానికి రాసిన లేఖల్లోనూ 41.15 మీటర్ల మేరకు నిధులు విడుదల చేయాలని అడగలేదా ?  వరదలకు డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి మీ అనాలోచిత నిర్ణయాలే కారణం అని ..పోలవరం అథారిటీ ఇచ్చిన రిపోర్ట్  మీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ?  అంటూ గాటుగా విమర్శించారు.

Also Read: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. - కుడి, ఎడుమ కాలువల సామర్థ్యాన్ని తగ్గించి మహానేత ఆశయాలకు తూట్లు పొడిచారని షర్మిల ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయితే, కర్త, కర్మ,క్రియ జగన్ మోహన్ రెడ్డి గారేనని సంచలన షర్మిల ట్వీట్ ద్వారా కామెంట్స్‌ చేశారు.

Also Read: Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ ఆర్థిక శాఖ హెడ్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్ లో 300 మంది ఉద్యోగులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

New Update
AP Fire Accident

AP Fire Accident

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే.. సరైన సమయానికి అగ్నిమాపాక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ ఏమైనా దగ్ధం అయ్యాయా? అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఫైర్ సిబ్బందిని తప్పా.. ఎవరినీ కార్యాలయం లోపలికి అధికారులు అనుమతించడం లేదు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ సెక్రటరీ తదితరులు కొద్ది సేపట్లో నిధి భవన్ ను సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: పాకిస్థాన్‌లో స్కూల్‌ బస్సుపై ఉగ్రదాడి.. నలుగురు చిన్నారులు మృతి

గత నెలలో సచివాలయంలో ప్రమాదం..

గత నెల 4న ఏపీ సచివాలయంలోనూ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో అంతస్తులో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత తదితరులు ఉండే ముఖ్యమైన ఈ ఫ్లోర్ లో ప్రమాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే.. ఉదయం సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: అకౌంట్‌లోకి రూ.15000 ఆ రోజే!

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. సచివాలయం మొత్తం కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ఎలాంటి ప్రమాదం జరిగినా కారణాలను సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుదన్నారు. భద్రతా ప్రమాణాలపై ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. 

(telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు