/rtv/media/media_files/2025/03/03/3ASatskwmRIRDwp91ISe.jpg)
Lady Aghori Naga Sadhu Hulchul in Tanuku Photograph: (Lady Aghori Naga Sadhu Hulchul in Tanuku)
Lady Aghori Arrest : గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్ చల్ చేస్తోంది. కాగా ఈ రోజు గుంటూరులో ప్రత్యక్షమైన అఘోరీ మరోసారి హల్‌చల్ చేసింది.హిందూ ఐక్య పోరాట వేదిక నేత అనిల్ బెహేరా చేసిన అనుచిత వ్యాఖ్యలపై అఘోరీ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అఘోరీ నిరసన చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అఘోరీకి సూచించారు. అఘోరీ ఎంతకీ వినకపోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇది కూడా చదవండి: Breaking News : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్!
గుంటూరుకు చెందిన అనిల్ బెహరాపై పోలీసులకు అఘోరీ ఫిర్యాదు చేసింది. --అనిల్ బెహరా అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ అఘోరీ కంప్లైంట్‌లో పేర్కొంది. --అనిల్ రోజూ తనకు వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి..--అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా పోలీసులు అఘోరీకి కౌన్సిలింగ్ ఇచ్చారు. --వివాదం వద్దంటూ లేడీ అఘోరీకి పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా అనిల్ ఛాలెంజ్ చేస్తేనే గుంటూరు వచ్చానని అఘోరీ వెల్లడించింది. అయితే అఘోరీని అరెస్ట్ చేసిన విషయం స్థానిక హిజ్రాలకు తెలియడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అఘోరీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కాగా లేడీ అఘోరీ కొద్ది రోజులుగా ఏపీలో హల్ చల్ చేస్తున్నారు. మార్చి 3న కూడా నెల్లూరు జిల్లా చిలకూరు మండలం భూధనం టోల్ ప్లాజా వద్ద ఆవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సడెన్‌గా తణుకులో ప్రత్యక్షమయ్యారు. అఘోరా బాబాగా పిలవబడుతున్న రాజేష్ నాథ్‌పై అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్‌నాథ్ ఇంటి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లి వదిలివేశారు. తాజాగా గుంటూరులో ప్రత్యక్షమై హల్ చల్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం