New Update
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భవం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి తణుకు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. ఆ తర్వాత పాలిటిక్స్ కు దూరం అయ్యారు. కానీ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నారు. వెంకటేశ్వరరావు మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తదితర రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా కథనాలు