/rtv/media/media_files/2025/09/07/ms-dhoni-debut-r-madhavan-the-chase-teaser-1-2025-09-07-13-31-14.jpg)
ms dhoni debut r madhavan the chase teaser (1)
క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ ఇప్పుడు సినిమాల వైపు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తరచూ కొత్త కొత్త సినిమా యాంగిల్స్‌లో వీడియోలతో అదరగొడుతున్నారు. గతంలో ఒక సైకిల్ యాడ్ చేసి అభిమానులు, ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అచ్చం ‘యానిమల్’ మూవీ రేంజ్‌లో ధోనిని చూపించి యాడ్‌ను అదరగొట్టేశారు. ఇప్పుడు ధోని, నటుడు ఆర్. మాధవన్ కలిసి నటించిన కొత్త ప్రాజెక్ట్ 'ది ఛేజ్'. తాజాగా దీని టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో ధోని, మాధవన్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లుగా యాక్షన్ మోడ్‌లో కనిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
the chase teaser
ఇవాళ ధోనికి సంబంధించి ఒక షాకింగ్ వీడియో బయటకొచ్చింది. హీరో మాధవన్ తన సోషల్ మీడియాలో ఒక సర్‌ప్రైజ్ వీడియోను షేర్ చేశాడు. దానిని అతడు ‘‘The Chase’’ టీజర్ రిలీజ్ అంటూ తెలిపాడు. అంతేకాకుండా అందులో ‘‘One mission. Two fighters.. Buckle up - a wild, explosive chase begins. The Chase - teaser out now. Directed by Vasan Bala. Coming soon’’ (ఒక మిషన్.. ఇద్దరు ధైర్యవంతులు. సిద్ధంగా ఉండండి - ఒక అద్భుతమైన, విస్ఫోటనకరమైన ఛేజ్ ప్రారంభం కానుంది. ది చేజ్ - టీజర్ ఇప్పుడే విడుదలైంది) అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. దీనిని వాసన్ బాలా దర్శకత్వం వహించినట్లు తెలిపాడు. అనంతరం కమింగ్ సూన్ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ టీజర్‌లో ఎంఎస్ ధోనీ మాస్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. మాధవన్‌తో పాటు మహేంద్ర సింగ్ ధోని కూడా పూర్తి స్థాయి పాత్రలో కనిపించాడు. ఇందులో ధోనీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌గా కాల్పులు జరుపుతూ కనిపించాడు. అయితే ఇది సినిమానా, వెబ్ సిరీస్‌నా లేదా మరేదైనా యాడా అనేది మాత్రం మాధవన్ స్పష్టం చేయలేదు. ప్రస్తుతం వీరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ గోప్యంగా ఉంచాడు.
धोनी fains के लिए खुशखबरी
— Aditya Giri (@Adigiri) September 7, 2025
उनकी दिल the Chase आ रही है।
Teaser out।#thechase#teaser@msdhonipic.twitter.com/2wJiDddVK0
ఇక టీజర్‌లో మాధవన్, ధోనిలను ‘ఇద్దరు ధైర్యవంతులు’గా చూపించారు. ఇద్దరూ యూనిఫాంలు ధరించి ‘మిషన్’ కోసం బయలుదేరినట్లు చూపించారు. ధోనిని ‘కూల్ హెడ్స్’ గా మనసుతో ఆలోచించే వ్యక్తిగా చూపించగా.. మాధవన్‌ను హృదయంతో ఆలోచించే రొమాంటిక్‌గా చూపించారు. ఇది సరదాగా ఉండే యాక్షన్-థ్రిల్లర్ షో అవుతుందని టీజర్‌లో పేర్కొన్నారు. ఈ టీజర్‌లో మాధవన్, ధోని నల్ల కళ్లద్దాలు ధరించి శత్రువులపై తూటాలు పేల్చుతున్న యాక్షన్ సన్నివేశం అదిరిపోయిందనే చెప్పాలి. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే అది వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ టీజర్ వీడియో చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇది సినిమానా లేక యాడా అని కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.