Actress Ranga Sudha: సోషల్ మీడియాలో నటి అశ్లీల వీడియోలు...ఆమె ఏం చేసిందంటే..?

సెలబ్రిటీలపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు సర్వసాధారణమై పోయాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మార్పు రావడం లేదు. తాజాగా సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ గా మారాయి. దీంతో ఆమె పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు.

New Update
Kanduri Sri Ranga Sudha

Kanduri Sri Ranga Sudha

Actress Ranga Sudha: సెలబ్రిటీలపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు సర్వసాధారణమై పోయాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మార్పు రావడం లేదు. తాజాగా టాలీవుడ్ సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ గా మారాయి. దీంతో ఆమె పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు.  రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నాడని ఈ మేరకు సుధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సుధ గతంలో రాధాకృష్ణ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉందట. అయితే తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్‌ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలో రాధాకృష్ణ తనను బెదిరించినట్లు  ఆమె తన ఫిర్యాదులో తెలిపారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం కొన్ని ట్విట్టర్ పేజీలలో రాధాకృష్ణ అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని నటి సుధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  గతంలో తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు చూపించి బెదిరిస్తున్నాడని, కొంతమంది ట్విట్టర్ పేజీ నిర్వాహకులతో కలిసి తన ఫొటోస్ ను మార్ఫ్ చేసి పెడుతున్నారని ఫిర్యాదులో తెలిపింది. ఇక రంగ సుధ ఫిర్యాదుపై పోలీసులు పాజిటివ్ గా స్పందించారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి రాధాకృష్ణ, మరికొంతమందిపై కేసు నమోదు చేశారు.సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినా,  షేర్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.  

వివరాలలోకేలితే నటి సుధ గతంలో రాధాకృష్ణ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ళకు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అతడికి దూరంగా ఒంటరిగా ఉంటోంది. ఈ నేపాధ్యంలో సుధపై కక్ష్య పెంచుకున్న రాధాకృష్ణ ప్రతీకారం తీర్చుకునేందుకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్విట్టర్‌ పేజీలలో సుధ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నట్లు సుధ ఆరోపిస్తోంది. అలాగే ప్రతి రోజు సుధకు కాల్ చేసి రాధాకృష్ణతో కలిసి ఉన్నప్పటి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను ఆన్లైన్ లో పెడతానన్ని బెదిరిస్తున్నాడని కూడా ఆమె పేర్కొంది. రాధాకృష్ణ వేధింపులు తట్టుకోలేక అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది సుధ. అలానే సోషల్ మీడియాలోని కొన్ని ట్విట్టర్ పేజీలపై కూడా ఫిర్యాదు చేసింది. సుధ ఫిర్యాదును స్వీకరించి రాధాకృష్ణపై కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు.  

రంగ సుధ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సేర్. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. మలయాళంలో హీరోయిన్ గా మారింది. తేరి మేరీ అనే మలయాళ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. సోషల్ మీడియాలో రంగ సుధకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో 9 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక నిత్యం ట్విట్టర్ లో ఆమె హాట్ హిట్ ఫోటోషూట్స్ ను చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది. తాజాగా  ఆమె సిగరెట్ కాలుస్తున్న ఒక వీడియో బయటపడింది. దీంతో ఇన్స్టాగ్రామ్ లో ఎంతో పద్దతిగా ఉండే ఈమె.. ఇలాంటి పనులు చేస్తుందేంటి అని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరి ఆ వీడియో నిజమో కాదో తెలియాల్సి ఉంది.

Also Read: ఉప రాష్ట్రపతి ఎన్నికలపై BRS కీలక నిర్ణయం.. నోటా లేకపోవడంతో..

Advertisment
తాజా కథనాలు