AP Crime : ఏపీలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహ**త్య!

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఒక కుటుంబం సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.. వీరిలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
FotoJet - 2026-01-23T134419.534

Four people in the same family commit suicide

పార్వతీపురం(parvathipuram-district-collector) మన్యం జిల్లా(manyam) లో విషాదం చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఒక కుటుంబం సూసైడ్(family-suicide)_ చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.. వీరిలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటనలో మీనక మధు(35), అతని భార్య సత్యవతి(30), వారి కుమారుడు మోష(4) మృతి చెందగా.. కుమార్తె ఆయోష పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దంపతుల మధ్య గొడవే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. 

Also Read :  పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు... ఎక్కడినుంచి ఎక్కడికో తెలుసా?

Big Tragedy In AP

కుటుంబంలో గొడవలతో పాటు రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ గత రాత్రి ఆ కుటుంబ సభ్యులంతా పురుగుల మందు సేవించి బలవర్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. మధు కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడిఉన్నారు. అయితే మృతులకు నలుగురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో బాబు చనిపోగా, కూతురు అయోషా (6) పార్వతీపురం జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరో ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ వసతి గృహంలో చదువుతున్నారు. దీంతో వారు ఇద్దరూ అనాదలుగా మిగిలిపోయారు. ఆర్థిక ఇబ్బందులు అప్పుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని సన్నిహితులు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు...పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :  మాట నిలిపి, సాయం అందించి.. జనసైనికుల కోసం పవన్ ఏం చేశారో తెలిస్తే!

Advertisment
తాజా కథనాలు