ఏపీలో 483 టన్నుల బియ్యం పట్టివేత!
విశాఖ పోర్టులో అక్రమంగా ఎగుమతి చేస్తున్న 483 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న విశాఖ పోర్టులో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో ఈ విషయం బయటపడింది.
విశాఖ పోర్టులో అక్రమంగా ఎగుమతి చేస్తున్న 483 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న విశాఖ పోర్టులో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో ఈ విషయం బయటపడింది.
ఏపీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బస్సులు కొరత, ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధానాలను రూపొందిస్తామని యార్లగడ్డ వెల్లడించారు.
బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకు బట్టలు ఆరేస్తుండగా షాక్ కొట్టడంతో తల్లి కాపాడటానికి ప్రయత్నించింది. ఈక్రమంలోనే ఆమెతో పాటు కొడుకు, కూతురు మరణించారు.
AP: రాష్ట్రానికి సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. యువరాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. నేషనల్ లెవల్లో పవన్‌కు పాపులారిటీ ఉందని అన్నారు.
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు 11,498 కోట్ల వ్యయం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు రూ.11,009 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
నిండు నూరేళ్లు బతకాల్సినవాళ్లు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఏపీలో కలకలం రేపింది. ప్రేమ విఫలం కావడంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో అటవీశాఖలోని క్వార్టర్లో విషాదం చోటుచేసుకుంది. నానమ్మ చిలకమ్మా,(55) మనవడు నాని(7)అనుమానాస్పద మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగ్రాతులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ లేబొరేటరీస్‌లో విషవాయువులు లీక్ కావడంతో ఒకరు మృతి చెందగా చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.