Vijaysai Reddy: తన రాజీనామాపై విజయసాయి రెడ్డి సంచలన ప్రెస్ మీట్!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజీనామా అనంతరం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానన్నారు. జగన్‌తో అన్నీ మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశానని తెలిపారు. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పుకొచ్చారు.

New Update

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అందులో ఆయన సంచలన విషయాలు చెప్పారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానన్నారు. జగన్‌తో అన్నీ మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశానని అన్నారు. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు. 

వెన్నుపోటు రాజకీయాలు తెలీవు

వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని అన్నారు. తన రాజీనామాకు, కాకినాడ పోర్టు కేసుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కేవీ రావుతో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారు. కేసుల మాఫీ కోసమే తాను రాజీనామా చేశానని దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. 

తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం తనకు అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందని పేర్కొన్నారు.  వైసీపీకి 11 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని.. తన రాజీనామాతో పార్టీకి నష్టం లేదన్నారు. 

Advertisment
తాజా కథనాలు