/rtv/media/media_files/2025/01/20/FybUyhsgs0bJdZ7bDl6Q.jpg)
lanke bindelu Photograph: (lanke bindelu)
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో ఓ దొంగ బాబా మోసం బయటపడింది. ఆనందపురం మండలంలో లంకె బిందెలకు పూజ చేస్తానని ఓ దొంగబాబా మాయమాటలు చెప్పాడు. బాధితుల నుంచి రూ.28 లక్షలు కొట్టేయాలని చూశాడు. నమ్మించి అడ్వాస్ రూంలో కొంత డబ్బు కూడా తీసుకున్నారు దొంగ బాబాతో వచ్చిన ముఠా. బాధితుల పిర్యాదుతో దొంగ బాబాతో పాటు మరో ఆరుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులో తీసుకోని ఆనందపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Also Read : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!
నిందితుల నుంచి లక్షా 75వేలు నగదు, 7 మోబైల్ ఫోన్లు, ఒక సిఫ్ట్ డిజైర్ కారు, రాగి బిందెలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పైడిపాటి వెంకట భార్గవ్ రాఘవ అలియాస్ యోగేంద్ర బాబాతో పాటు మరో నలుగురు పాత నేరస్థులు ఉన్నారు. సీఐ వాసు ప్రెస్‌మీట్‌లో కేసు వివరాలు తెలిపారు.
Also Read : మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పదేళ్ల నాగసాధు...!
 Follow Us