Ap Crime News: ఏపీలో దారుణం.. మహిళను నడ్డి రోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళి దాడి: వీడియో వైరల్!

విశాఖలోని మధురవాడ పీఎంపాలెంలో దారుణం జరిగింది. మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తోన్న ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఆమెను కిలోమీటర్ పొడవునా నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
vizag crime 3 persons attacking on women

vizag crime 3 persons attacking on women

Ap Crime News: మహిళలపై రోజు రోజుకు దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. మహిళలని చూడకుండా నడిరోడ్డుపైనే అత్యంత కౄరంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. అందరూ చూస్తుండగానే దాడి చేస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 

మహిళ జుట్టు పట్టుకుని..

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం(Visakhapatnam) మధురవాడ(Madhurawada) పీఎంపాలెంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నడ్డి రోడ్డులో ఒక మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురవాడ పీఎంపాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫెన్ బండి నిర్వహిస్తున్న ఒక మహిళలపై ముగ్గురు వ్యక్తులు అతి కిరాతకంగా దాడి చేశారు. ఆ ముగ్గురిలో ఒక మహిళ ఉండటం గమనార్హం.

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు! 

కిలోమీటర్ పొడవునా ఈడ్చుకెళ్లి..

టిఫెన్ బండి నిర్వహిస్తున్న ఆ మహిళలపై కౄరంగా ప్రవర్తించారు. నడిరోడ్డుపై ఆ మహిళ జుట్టుపట్టుకుని కిలోమీటర్ పొడవునా ఈడ్చుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ఘటనపై ఆ బాధిత మహిళ పీఎంపాలెం పిఎస్ లో ఫిర్యాదు చేసింది.

  

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

కానీ తాను ఫిర్యాదు చేసినా పీఎం పాలెం పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని ఆ మహిళ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఎటువంటి విచారణ చేయ్యకుండానే తిరిగి ఆ మహిళలను పీఎంపాలెం పోలీసులు బెదిరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. హోటల్ సమయం మించి నిర్వహిస్తున్నందుకు కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 

కేసు రాజీ చేసుకోవాలంటూ అధికారులు తనపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆమె ఆరోపించింది. ఈ క్రమంలోనే పీఎం పాలెం పోలీసులుపై సీపీకి ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ సిద్దమైంది. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు