/rtv/media/media_files/2025/01/24/z2SaxZ0XhIIBP5oiWA4P.jpg)
ap ganja case Photograph: (ap ganja case)
Fake cigarettes: ఏపీలో నకిలీ సిగరేట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. అంతేకాదు ఈ ఫేక్ సిగరేట్లలో వాడేందుకు ఉపయోగిస్తున్న 2 టన్నుల గంజాయి, 10 టన్నుల చైనీస్ గార్లిక్ సైతం పట్టుబడటం సంచలనం రేపుతోంది. వీటిని కిరాణా షాపులు, పాన్ డబ్బాల్లో స్పెషల్ రేట్లకు అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు దాడులు చేయడంతో భయంకరమైన గుట్టు రట్టైంది.
3 కోట్ల విలువైన 2 టన్నుల గంజాయి..
ఈ మేరకు వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో భారీగా నకిలీ సిగరెట్లు, గంజాయి, 10 టన్నుల చైనీస్ గార్లిక్‌ను ధ్వంసం చేసినట్లు కస్టమ్స్ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. సెంట్రల్ జీఎస్టి, కస్టమ్స్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో 9 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అలాగే ఇందులో వాడేందుకు వినియోగిస్తున్న 3 కోట్ల విలువైన 2 టన్నుల గంజాయిని కూడా గుర్తించి కాల్చివేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్
'ఫేక్ సిగరెట్లు ఇల్లీగల్ గా వచ్చే ఇంటర్నేషనల్ సిగరెట్లపైన ప్రత్యేక దృష్టి పెట్టాం. నేపాల్, కోల్‌కతా సరిహద్దు నుంచి అక్రమంగా మనదేశంలోకి తీసుకువచ్చిన10టన్నుల చైనీస్ గార్లిక్ పట్టుకున్నాం. గంజయా ప్యాకెట్స్ ను గుర్తించాం. వీటిని సరాఫరా చేస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేసి వైజాగ్ కోర్టులో ప్రవేశపెట్టాం' అని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: BRS MLA Kaushik Reddy: ఈటల సొంతూరిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అవమానం!