AP: ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ.. కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ అభివృద్ధి చెందేలా రూ.28 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈరోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా వీటిని ప్రారభించనున్నారు. 

New Update
modi

Modi Meeting In Vizag

ప్రధాని మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో విశాఖకు రానున్నారు. అక్కడి రైల్వే జోన్ సహా పలు కీలక పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.  వీటితో పాటూ  మోదీ అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, బల్క్‌డ్రగ్‌ పార్క్‌కు అంకురార్పణ చేయనున్నారు. కొత్తగా రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. 

Also Read: Nithin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ

భారీ బహిరంగసభ..

ప్రారంభోత్సవాల తర్వాత వైజాగ్‌లోనే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఇందులో ప్రధానితో పాటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ స్పీకర్ పవన్ కల్యాణ్‌ సహా పలువురు మంత్రులు ఇందులో పాల్గొంటారు. దీని కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లను చేశారు. దాంతో పాటూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పాటిస్తున్నారు. దీనిలో భాగంగా డ్రోన్లు, వీడియోలు తీయడం లాంటి వాటిపై నిషేధం పెట్టారు. భారీ బహిరంగ సభ కన్నా ముందు మోదీ, చంద్రబాబు, పవన్లు కలిసి రోడ్ షో కూడా చేయనున్నారు. 

ఈరోజు ఉదయానికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు వైజాగ్ చేరుకోనున్నారు. సాయంకాలం 4.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ ప్రధానికి స్వాగతం పలికిన తర్వాత 4.45కు సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదిక అయిన ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వరకూ 45 నిమిషాల పాటు ముగ్గురు నేతలూ రోడ్‌షోలో పాల్గొంటారు. ఆ తరువాత 5.30 నుంచి 6.45 వరకూ సభ ఉంటుంది. ఇందులోనే వైదికపై నుంచి ప్రధని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 

Also Read: ISRO: ఇస్రో తదుపరి ఛైర్మన్ వి. నారాయణన్

Advertisment